Actor Suriya Drops Out Of Director Bala's Vanangaan Movie - Sakshi
Sakshi News home page

ఊహించని ట్విస్ట్‌ ఇచ్చిన సూర్య.. ఆ సినిమా నుంచి ఔట్‌

Published Tue, Dec 6 2022 9:11 AM | Last Updated on Tue, Dec 6 2022 9:35 AM

Suriya Drops Out Of Bala Vanangaan Movie - Sakshi

హీరో సూర్య–దర్శకుడు బాలది హిట్‌ కాంబినేషన్‌. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన ‘నందా’, ‘పితామగన్‌’ (శివపుత్రుడు) మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అందుకే 19 ఏళ్ల తర్వాత మళ్లీ బాల దర్శకత్వంలో సూర్య హీరోగా సినిమా ఆరంభమైనందుకు అభిమానులు ఆనందపడ్డారు. ‘వణంగాన్‌’ టైటిల్‌తో ఈ చిత్రం ఆరంభమైంది. అయితే ఊహించని ట్విస్ట్‌ ఇచ్చారు సూర్య–బాల. ఈ చిత్రం నుంచి సూర్య తప్పుకున్నారు.

ఈ విషయం గురించి బాల ఓ లేఖ విడుదల చేశారు. ‘‘వణంగాన్‌’ కథలో చేసిన మార్పుల వల్ల ఈ కథ సూర్యకి తగ్గట్టుగా ఉంటుందా? అనే ఫీలింగ్‌ కలిగింది. నా మీద, ఈ కథ మీద సూర్య పూర్తి నమ్మకంతో ఉన్నారు. అంత గౌరవం, ప్రేమ చూపించే నా తమ్ముడికి చేదు అనుభవం ఎదురు కాకుండా చూడటం ఒక అన్నయ్యగా నా బాధ్యత. అందుకే మేమిద్దరం (సూర్య–బాల) ఒక అవగాహనకు వచ్చాం. ఈ సినిమా నుంచి తను (సూర్య) తప్పుకోవడం కరెక్ట్‌ అని నాకు, సూర్యకి అనిపించింది. ఇందుకు సూర్య బాధపడ్డారు. భవిష్యత్తులో మేం కలిసి సినిమా చేస్తాం’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు బాల. కాగా ‘వణంగాన్‌’ పనులు కొనసాగుతాయని బాల స్పష్టం చేశారు. అయితే సూర్య స్థానంలో ఏ హీరోని తీసుకోవాలనుకుంటున్నారో బయటపెట్టలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement