బాల దర్శకత్వంలో జ్యోతిక..? | Jyothika in Balas next | Sakshi
Sakshi News home page

బాల దర్శకత్వంలో జ్యోతిక..?

Published Tue, Feb 21 2017 3:30 PM | Last Updated on Tue, Sep 5 2017 4:16 AM

బాల దర్శకత్వంలో జ్యోతిక..?

బాల దర్శకత్వంలో జ్యోతిక..?

పెళ్లి తరువాత చాలా కాలం పాటు సినిమాలకు దూరమైన స్టార్ హీరోయిన్ జ్యోతిక, రీ ఎంట్రీలో సెలెక్టివ్గా సినిమాలు చేస్తోంది. 36 వయోదినిలే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన జ్యోతిక మగలిర్ మట్టుమ్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ రెండు సినిమాల తరువాత కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సరసన జ్యోతిక హీరోయిన్గా నటిస్తుందన్న వార్తలు వినిపించాయి. కానీ చివరి నిముషంలో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది.

తాజాగా జ్యోతిక తదుపరి చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన అప్ డేట్ ఒకటి కోలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. కమర్షియల్ ఫార్ములాకు దూరంగా రియలిస్టిక్ సినిమాలను తెరకెక్కించే క్రియేటివ్ డైరెక్టర్ బాల దర్శకత్వంలో జ్యోతిక నటించనుందన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు బాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జ్యోతిక లీడ్ రోల్లో నటించనుందట.  బాల సినిమాలో లీడ్ క్యారెక్టర్స్ పూర్తిగా డీగ్లామర్ లుక్లో కనిపిస్తుంటారు. మరి జ్యోతికను బాల ఎలా చూపిస్తాడో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement