తెలంగాణ సర్కారును కోరిన సమంత
సాక్షి, హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమలో మహిళలకు సురక్షితమైన పని వాతావరణాన్ని నెలకొల్పడానికి వీలుగా జస్టిస్ కె.హేమ కమిటీ తరహాలో సబ్ కమిటీని నియమించాలని నటి సమంత తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులపై నియమించిన జస్టిస్ హేమ కమిటీ ఇచి్చన నివేదికపై పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా సమంత కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘తెలుగు చిత్ర పరిశ్రమలోని మహిళలమైన మేము జస్టిస్ హేమ కమిటీ నివేదికను స్వాగతిస్తున్నాం. దీనికి బాటలు వేసిన కేరళ డబ్ల్యూసీసీ (ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్) నిరంతర ప్రయత్నాలను అభినందిస్తున్నాం. తెలుగు చిత్ర పరిశ్రమలోని మహిళలకు మద్దతుగా నిలిచేందుకు 2019లో నెలకొలి్పన ‘ది వాయిస్ ఆఫ్ ఉమెన్’కూడా డబ్ల్యూసీసీ గ్రూప్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి..’అని సమంత సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment