మలయాళ చిత్ర పరిశ్రమను కుదిపేస్తోన్న హేమా కమిటీ గురించి జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. అక్కడి పరిశ్రమలో పనిచేసే మహిళలు లైంగికదాడికి గురౌతున్నారని హేమా కమిటీ పేర్కొంది. కొద్దిరోజుల క్రితం ఆ నివేదికను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు కమిటీ అందించింది. దీంతో చాలామంది బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని తెరమీదకు తీసుకొచ్చారు.
తాజాగా హేమా కమిటీ నివేదికపై జరిగే విచారణను సీబీఐకి వదిలేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈమేరకు న్యాయవాదులు ఏ జన్నాత్, అమ్యతా ప్రేమ్‌జిత్‌లు కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తును కూడా సీబీఐకి అప్పగించాలని పిటిషన్‌లో వారు డిమాండ్ చేశారు. హేమా కమిటీ ముందు వాంగ్మూలం ఇచ్చిన వారికి భద్రత కల్పించాలని పిటిషన్‌లో కోరారు. సినిమా రంగంలో మహిళల భద్రతకు చట్టం అవసరమని ఈమేరకు కేసుల పరిష్కారానికి ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని పిటిషన్‌లో డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment