

యూ ట్యూబ్, సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉండే వాళ్లకు అనిల్ జీల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. గంగవ్వ లాంటి సీనియర్ టాలెంట్ ఉన్న వారిని 'మై విలేజ్ షో' యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి అనిల్ గీల్లా. ఇప్పుడు బిగ్ బాస్ 7లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం.

శోభా శెట్టి.. బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచయం ఉన్న పేరు.'కార్తీకదీపం'లో మోనితగా ఎంతో ఫేమస్ అయ్యారు. అందులో నెగిటివ్ క్యారెక్టర్‌తో గుర్తింపు తెచ్చుకున్న శోభా శెట్టి బిగ్ బాస్ 7లో కంటెస్టెంట్‌గా మరోసారి బుల్లితెర ప్రేక్షకులను అలరించనుంది.

జబర్దస్త్ కామెడీ షో ద్వారా పేరు సంపాదించుకున్న మహేశ్. ఆ తర్వాత రంగస్థలం సినిమాలో నటనతో మరితం ఫేమ్ తెచ్చుకున్నాడు. కామెడీ షోలో ఎప్పుడు కడుపుబ్బా నవ్వించే మహేశ్.. తన యాస, డైలాగ్స్‌తో సినిమాల్లో తన మార్క్ చూపించారు. బిగ్ బాస్‌లోకి ఎంట్రీ దాదాపు ఖాయం అని సమాచారం.

షకీలా ప్రముఖ దక్షిణ భారత చలన చిత్ర నటి. ఎక్కువగా మళయాళ శృంగార చిత్రాలలో నటించింది. సుమారు 110 సినిమాల్లో నటించిన షకీలా, ఎక్కువగా తమిళం, మళయాళం, తెలుగు, కన్నడ, హిందీ సినిమాల్లో నటించింది. షకీలా నటించిన ఈ సినిమాలన్నీ దాదాపు "బి" గ్రేడ్ 'సాఫ్ట్‌కోర్' సినిమాలుగానే చెప్పుకోవచ్చు. బిగ్‌బాస్ ఎంట్రీతో అలరించేందుకు రెడీగా ఉన్నారట

ఆట సందీప్ ఒకప్పుడు ఆట డ్యాన్స్ షోతో దుమ్ములేపిన కంటెస్టెంట్‌గా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత జడ్జిగా మెరిసిన ఆట సందీప్ మెరిశాడు. మళ్లీ ఆయన బుల్లితెరపై తన హవా కొనసాగించాలని ప్లాన్‌లో ఉన్నాడు. బిగ్ బాస్ 7 నుంచి మళ్లీ తన కెరీర్ ముందుకు కొనసాగించాలని ఉన్నాడట.

బాహుబలితో మంచి గుర్తింపు తెచ్చుకున్న సింగర్ మోహన భోగరాజు. బుల్లెట్ బండి పాటతో మాస్ ఆడియన్స్‌కు మరింత దగ్గరైంది. తను సొంతంగా చేసుకున్న ఆల్బమ్ సాంగ్స్, కవర్ సాంగ్స్ వల్లే తనకు ఎక్కువగా గుర్తింపు లభించింది. ఇప్పుడు బిగ్ బాస్ 7 ప్రేక్షకులను తన పాటలతో మైమరింపించడానికి కంటెస్టెంట్‌గా అడుగుపెట్టనుంది.

‘జబర్దస్త్’లో చిన్న కంటెస్టెంట్ గా వచ్చి మంచి కమెడియన్స్ గా గుర్తింపు తెచ్చుకున్నారు తేజ. ప్రస్తుతం ఆయన ఒక యూట్యూబ్ ఛానెల్‌ను ఏర్పాటు చేసుకుని పలువురి సెలబ్రిటీలతో ఫుడ్ వ్లాగ్స్ చేస్తున్నారు. బిగ్ బాస్ 7కు వెళ్లేందుకు ఆయన రెడీ అయినట్లు సమాచారం.

బిగ్ బాస్ 7కు మరింత గ్లామర్ డోస్ పెంచేందుకు హాట్ యూట్యూబర్ శీతల్ గౌతమన్ ఎంట్రీ ఇవ్వనున్నారు. పలు వెబ్ సిరీస్‌లతో మంచి నటిగా పేరు తెచ్చుకోవడంతో పాటు సోషల్ మీడియాలో పోస్టుల ద్వార కుర్రాళ్లను విపరీతంగా ఆకట్టుకున్న శీతల్ కూడా బిగ్ బాస్ 7లో భాగం కానుందట.

కన్నడ నుంచి వచ్చి తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న బుల్లితెర నటి ఐశ్వర్య. ఒకప్పుడు ఏ సీరియల్లో చూసినా తనే మెయిన్ లీడ్‌గా కనిపించేది. ప్రస్తుతం ఐశ్వర్యకు కొంతమేరకు అవకాశాలు తగ్గిపోయాయని చెప్పవచ్చు. దీంతో బిగ్ బాస్ 7 తనకు మరోసారి అవకాశాలు తెచ్చిపెడుతుందని ఇందులో కంటెస్టెంట్‌గా రావడానికి ఒప్పుకున్నట్టు సమాచారం.

తెలుగులో 'అందరూ అందరే' సినిమా అనంతరం పోకిరి రాజా, పుణ్యభూమి నాదేశం, గ్యాంగ్ మాస్టర్, కలియుగంలో గందరగోళం అల్లరిపెళ్ళికొడుకు, ఊహ, అక్క బాగున్నావా పలు సినిమాల్లో హీరోయిన్స్‌గా వెలిగిపోయిన శుభశ్రీ చాలా ఎళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆమె మాలశ్రీ సోదరి అనే విషయం తెలిసిందే. బిగ్ బాస్ 7లో కంటెస్టెంట్‌గా రీ ఎంట్రీకి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.