

తెలుగబ్బాయి అమర్‌దీప్ సీరియల్స్ తో మంచి గుర్తింపు ఉంది. ఆయనకు ఒక వారానికి రెమ్యునరేషన్ రూ. 2.5 లక్షలు బిగ్‌బాస్ ఇస్తున్నట్లు సమాచారం

టాలీవుడ్‌లో ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆట సందీప్‌కు బిగ్‌బాస్‌లో ఒక వారం ఉన్నందుకు గాను అందకుంటున్న రెమ్యునరేషన్ రూ.2.5 లక్షలు. ఇది ఒక వారానికి మాత్రమే

తెలుగులో పలు సినిమాల్లో పాటలు పాడి గాయనిగా గుర్తింపు తెచ్చుకున్న దామినికి మంచి ఇమేజ్ ఉంది. ఆమెకు రెమ్యునరేషన్‌గా వారానికి రూ. 2 లక్షలు ఉంటుందని టాక్ వినిపిస్తుంది.

డాక్టర్ గౌతమ్ కృష్ణ ఆకాశవీధుల్లో సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన ఆయనకు బిగ్ బాస్ ఒక వారానికి గాను ఇస్తున్న రెమ్యునరేషన్ రూ. 1.5 లక్షలు

కిరణ్ రాథోడ్.. ఈమె బాలీవుడ్ నటి రవీనా టండన్ కజిన్. ఈమెకు బిగ్ బాస్ ఇస్తున్న రెమ్యునరేషన్ ఒక వారానికి రూ. 3 లక్షలని ప్రచారం ఉంది.

పల్లవి ప్రశాంత్.. ఇన్‌స్టాగ్రామ్ గుర్తింపు ద్వారా వెళ్లిన ఇతనికి ఒక వారానికి ఒక లక్ష వరకు ఉంటుంది

బిగ్ బాస్ 7వ సీజన్‌లో తొలి కంటెస్టెంట్‌గా అడుగు పెట్టిన ప్రియాంక జైన్ సీరియల్స్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. స్వతహాగా ఈమె యూట్యూబర్ కూడా.. ఒక వారానికి గాను ఈమె తీసుకుంటున్న రెమ్యునరేషన్ రూ. 2.5 లక్షలు. అయితే రోజుకు రూ.35 వేలు ఉంటుంది.

రతిక రోజ్ అచ్చ తెలుగమ్మాయి.. ఈ బ్యూటీకి బిగ్ బాస్ ఇస్తున్న రెమ్యునరేషన్ రూ. 1.75 లక్షలు

బోల్డ్ క్యారెక్టర్లకు పెట్టింది పేరు షకీల. సౌత్ ఇండియాలో ఆమె పేరు తెలియని వారు ఉండరు. ఒక వారం బిగ్‌బాస్ ఇంట్లో ఆమె ఉండేందుకు తీసుకుంటున్న రెమ్యునరేషన్ రూ. 3.75 లక్షలు అంటే నెలకు రూ. 15 లక్షలు పై మాటే.. ఈ సీజన్‌లో అత్యధిక రేమ్యునరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్‌గా షకీల ఉన్నారు.

శోభా శెట్టి కార్తీకదీపం సీరియల్‌లో మోనితగా పాపులర్ అయ్యారు. ఈమె స్వస్థలం కర్ణాటక అయినా అచ్చ తెలుగింటి అమ్మాయిగా సీరియల్‌లో నటించి విశేష అభిమానులను దక్కించుకుంది. ఈమెకు ఒక వారం బిగ్ బాస్‌లో ఉన్నందుకు గాను రూ. 2 లక్షలు తీసుకుంటుందని టాక్

సినీ నటుడు శివాజీకి బిగ్ బాస్ ఇస్తున్న రెమ్యునరేషన్ ఒక వారానికి రూ.3 లక్షలు అని టాక్.

శుభశ్రీ రాయగురు ప్రొఫెషనల్‌గా లాయర్. ఒడిశాలో పుట్టిపెరిగిన ఈ బ్యూటీ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటోంది. ఈమెకు ఒక వారానికి రెమ్యునరేషన్ రూ. 2 లక్షలు

ఫుడ్ వీడియోలతో పాపులర్ అయిన టేస్టీ తేజ.. ఒక వారం బిగ్ బాస్‌లో ఉన్నందుకు గాను అతను తీసుకుంటున్న రెమ్యునరేషన్ రూ. 1.75 లక్షలు

మోడల్ ప్రిన్స్ యావర్ కోసం బిగ్ బాస్ ఇస్తున్న రెమ్యునరేషన్ రూ. 1 లక్ష.