చెన్నై: నటనతోనే కాదు.. పేదలకు అన్నం పెట్టి దాతృత్వం కూడా చూపగలనని.. నటి షకీలా నిరూపించుకుంటున్నారు. కరోనా కాలంలో ఆమె సామాజిక సేవకు సిద్ధమయ్యారు. లాక్‌డౌన్ కారణంగా ఆకలితో రోడ్ల పక్కన తిరగాడుతున్న నిరుపేదలకు అన్నం పెట్టి వారి కడుపు నింపుతున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను షకీలా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అందులో ఆమె పేర్కొంటూ.. రెండు చేతుల్లో ఒక చేతిని మీకోసం, మరో చేతిని ఇతరులకు సాయపడేందుకు ఉపయోగించండి.. పేదలకు చేతనైన సాయం చేయండి.. అంటూ పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment