
`'నేను నిర్మించిన 'లేడీస్ నాట్ అలౌడ్' సినిమా పది నెలలుగా సెన్సార్ అవడం లేదు. ఎంతో వల్గారిటీతో వచ్చిన సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ మా సినిమాకే సెన్సార్ వాళ్లు ఎందుకు అభ్యంతరాలు చెపుతున్నారో అర్థం కావడం లేదు. ప్రస్తుతం అది ట్రిబ్యునల్లో ఉంద’ ని నటి షకీలా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆదివారం షకీల ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'షకీలా రాసిన మొట్టమొదటి కుటుంబ కథాచిత్రం' సినిమా ఫస్ట్ గ్లిమ్స్ ఆవిష్కరణ ఫిల్మ్ చాంబర్లో జరిగింది. ఈ సందర్భంగా షకీలా మాట్లాడుతూ.. ‘‘ షకీలా అంటే వల్గారిటీ సినిమాలేనా.. ఫ్యామిలీ సినిమాలు చేయదా? అనే విమర్శలున్నాయి. అన్ని రకాల సినిమాలు చేయగలనని నిరూపించడం కోసం కుటుంబ కథాచిత్రంగా ఈ సినిమా చేస్తున్నాను. షకీలా నిర్మాత అంటేనే సెన్సార్ ఇవ్వడం లేదు.. ఇది నేను రాసిన కథ అంటే ఇంకా ఎన్ని ఇబ్బందులు పెడతారో. కానీ ఇది ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్’’ అని అన్నారు. 24 క్రాఫ్ట్స్ బ్యానర్స్‌పై సీవీ రెడ్డి సమర్పణలో సి.హెచ్ వెంకట్ రెడ్డి నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కింది. విక్రాంత్, పల్లవి ఘోష్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు సతీష్ వి.ఎన్ దర్శకత్వం వహించారు.
Comments
Please login to add a commentAdd a comment