నా లైఫ్‌లో జరిగినదంతా చెప్పాను: షకీలా | Richa Chadda to play Shakeela in biopic about the southern adult film star | Sakshi
Sakshi News home page

దాచలేదు!

Published Sun, Jul 22 2018 12:59 AM | Last Updated on Sun, Jul 22 2018 12:52 PM

Richa Chadda to play Shakeela in biopic about the southern adult film star - Sakshi

షకీలా

‘నిజాలు దాచి బయోపిక్‌ తీసి ఉపయోగమేంటి?’ అంటున్నారు నటి షకీలా. ఆమె జీవితం ఆధారంగా దర్శకుడు ఇంద్రజిత్‌ లంకేశ్‌ ఓ బయోపిక్‌ రూపొందిస్తున్నారు. ఇందులో టైటిల్‌ రోల్‌ను బాలీవుడ్‌ నటి రీచా చద్దా పోషిస్తున్నారు. ఈ చిత్రంలో తన పాత్రకు సంబంధించిన ప్రిపరేషన్‌ కోసం షకీలాను కలుసుకున్నారు రీచా. ఈ బయోపిక్‌ గురించి షకీల మాట్లాడుతూ – ‘‘రీచాకు, నాకు మధ్యలో ఒక కామన్‌ పాయింట్‌ కనిపించింది.

ఫిజికల్‌ సిమిలారిటీ గురించి కాదు, మా ఇద్దరి ఆలోచనా విధానం గురించి అంటున్నాను. రీచా కూడా నాలానే ధైర్యవంతురాలు, ఫ్రీగా ఆలోచించే మనిషి. స్క్రిప్ట్స్‌లో ఉన్న లేయర్స్‌ని కూడా అర్థం చేసుకోగల నటి. ఈ సినిమాకు సంబంధించి నేను ఎటువంటి నిబంధనలు పెట్టడం లేదు. నా లైఫ్‌లో జరిగినదంతా చెప్పాను. నిజాలు దాచాలనుకున్నప్పుడు బయోపిక్‌ తీసి ఉపయోగమేముంది’’ అని పేర్కొన్నారు. ఈ సినిమా ఆగస్ట్‌లో సెట్స్‌ మీదకు వెళ్లనుందని సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement