సంచలనాలు సృష్టించనున్న షకీల! | Shakeela to be create sensations! | Sakshi
Sakshi News home page

సంచలనాలు సృష్టించనున్న షకీల!

Published Mon, Sep 22 2014 9:21 AM | Last Updated on Mon, Aug 13 2018 4:19 PM

షకీల - Sakshi

షకీల

షకీల.ఆ పేరులోనే వైబ్రేషన్లు ఉన్నాయి. ఒకప్పుడు మళయాల సినిమా రంగాన్ని ఏలిన తెలుగు హీరోయిన్ షకీల తన జీవితంలోని నిజాలను బయటపెట్టి సంచలనాలు సృష్టించబోతోంది. కుర్రకారుని ఉర్రూతలూగించే  తన సినిమాలతో మాలీవుడ్  వెండితెరను మహారాణిలా పాలించిన ఈ శృంగార తార  సినిమా విడుదల  అవుతుందంటే చాలు పెద్ద పెద్ద హీరోలకే ముచ్చెమటలు పట్టేవి. భారీ బడ్జెట్తో నిర్మించిన స్టార్ హీరోల సినిమాలను వాయిదా వేసుకునేవారు.  ఇప్పుడు ఆ హీరోయిన్ తన జీవిత చరిత్ర ఆధారంగా తానే కధానాయికగా ఓ సంచలన చిత్రం నిర్మించబోతోంది.  ఆ సినిమాలో అన్నీ వాస్తవాలే ఉంటాయని ఆమె చెబుతోంది. దాంతో కొందరు పెద్దలకు తమ బండారం ఎక్కడ వెలుగులోకి వస్తుందోనని వణుకుపుడుతోంది.

వెండితెర నటీమణుల జీవితాలతో గతంలో ఎన్నో సినిమాలు తెరకి ఎక్కాయి. డర్టీ పిక్చర్ లాంటి సినిమాలైతే సూపర్ డూపర్ హిట్ సాధించాయి.  కలెక్షన్లే కాకుండా, అవార్డుల వర్షం కూడా  కురిపించాయి. తెర వెనుక చీకటి నిజాలు,  హీరోయిన్లు కష్ణాలు, వారు ఎదుర్కొనే అవమానాలు, మానాభిమానాలను కాపాడుకోవడానికి వారు పడేపాట్లను ఇటీవల షకీల బయటపెట్టారు. దాంతో  గుమ్మడికాల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు కొందరు పెద్దలు ఉలిక్కిపడ్డారు. అందరూ పెద్దలు కాదని వాళ్ళలో కొందరు గద్దల కూడా ఉన్నారని ఆమె విరుచుకుపడ్డారు.  ఇప్పుడు ఆ నిజాలన్నీ కలిపి షకీల సినిమా కూడా తీస్తున్నారు.

సినీ జీవితంలోకి రాకముందు, వచ్చిన తర్వాత తాను పడ్డ అవమానాలు, ఎదుర్కొన్న చీత్కారాలు, వేధింపులతో ఏకంగా షకీల గతంలో ఓ పుస్తకమే రాశారు. ఈ పుస్తకం సంచలనాలకు కేంద్రబిందువైంది.  ఇప్పుడు అదే పుస్తకం ఆధారంగా సినిమా నిర్మాణానికి సిద్ధమయ్యారు.  ఆ సినిమాలో తానే లీడ్ రోల్లో నటించబోతోంది.  పుస్తకం అందరికీ చేరడానికి కొంత సమయం పడుతుంది. అదే  సినిమా అయితే జనాల్లోకి చాలా తేలికగా చొచ్చుకుపోతుంది. ఈ సినిమా విడుదలైన తరువాత  కొందరు నొచ్చుకొవడం ఖాయం. అందుకే  నిజాలు తెలిస్తే తనను చంపేసినా చంపేస్తారని షకీల అనుమానం కూడా వ్యక్తం చేశారు. దేశంలోని వివిధ భాషల్లో దాదాపు 250 చిత్రాల్లో నటించిన షకీల రూపొందించే ఈ సినిమా నిర్మాణం పూర్తి అయితే  ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూద్దాం.
- శిసూర్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement