
మలయాళ చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ వివాదం పెద్ద దుమారమే రేగుతుంది. మలయాళ ప్రముఖ నటుడు సిద్ధిఖీపై నటి రేవతి సంపత్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తనపై సిద్ధిఖీ అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించింది. అయితే, తాజాగా నటి రేవతి సంపత్‌పై డీజీపీకి సిద్ధిఖీ ఫిర్యాదు చేశారు. చాలా ఏళ్లుగా ఆమె తన గురించి తప్పుగా మాట్లాడుతుందని, తన పరువును బజారుకు లాగుతుందని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
సిద్ధిఖీ గురించి రేవతి చేసిన ఆరోపణలు ఇలా ఉన్నాయి.. సుమారు ఎనిమిదేళ్ల క్రితం సోషల్‌మీడియా ద్వారా సిద్ధిఖీ పరిచయం అయ్యాడని రేవతి సంపత్ తెలిపింది. సనిమాల్లో ఛాన్సులు ఇప్పిస్తానని నమ్మించి తనను ఒక హోటల్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించింది. 'ప్రస్తుతం అందరూ సిద్దిఖీ మంచివాడు అంటున్నారు. ఆయన నిజస్వరూపం చాలామందికి తెలియదు. ఆయనలోని మరో కోణాన్ని నేను చూశా. తిరువనంతపురంలోని మస్కట్ హోటల్‌కు నన్ను తీసుకెళ్లి అక్కడ నాపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. నాపై అత్యాచారం చేశాడు. ఆయనొక క్రిమినల్. ఆయన వల్ల నా కెరియర్ మొత్తం నాశనం అయింది.' అని తెలిపింది.
మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి జస్టిస్ హేమ కమిటీ ఒక నివేదికను రూపొందించింది. అందులో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగుచూశాయి. మాలీవుడ్ పరిశ్రమలో ఉండే మహిళలు కాస్టింగ్ కౌచ్ నుంచి వివక్ష వరకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని హేమ కమిటీ పేర్కొంది. ఈ క్రమంలో మలయాళ నటి రేవతి సంపత్ సంచలన ఆరోపణలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment