నటి షకీలా 1990వ కాలంలో స్టార్ హీరోలకు సమానంగా క్రేజ్ సంపాదించుకున్న నటి. పలు భాషల్లో 200 పైగా చిత్రాల్లో నటించి శృంగార తారగా ప్రేక్షకులను అలరించిన షకీలా త్వరలోనే డిజిటల్ ఎంట్రీకి సిద్ధమైంది. సొంతంగా ఓటీటీ ప్లాట్‌ఫాం ద్వారా తన చిత్రాలతో పాటు ఇతర సినిమాలను రిలీజ్ చేస్తానని పేర్కొంది. తన కుమార్తెను హీరోయిన్‌గా పరిచయం చేస్తూ రెండు ప్రాజెక్టులను అనౌన్స్ చేసిన షకీలా ఆ సినిమాలకు సంబంధించిన పోస్టర్లను రిలీజ్ చేసింది.
శుక్రవారం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. డైరెక్టర్ రమేష్ కావలి చెప్పిన స్క్రిప్ట్ తనకు బాగా నచ్చాయని, గోవాలో అద్భుతమైన లొకేషన్లలో షూటింగ్ చేస్తున్నట్లు తెలిపారు. అంతుకాకుండా ఈ రెండు సినిమాల్లోనూ తన కూతురితో కలిసి నటించానని పేర్కొన్నారు. గతంలో ఓ సినిమా రిలీజ్ విషయంలో సెన్సార్ వద్ద చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని, అందుకే సొంతంగా తమ ఓటీటీ సంస్థలో సినిమాలు రిలీజ్ చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment