
సాక్షి, హైదరాబాద్: సమాజోద్ధరణకు గాంధీ మార్గమే శరణ్యమని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి అన్నారు. డాక్టర్ ఎస్‌డీ సుబ్బారెడ్డి రచించిన ‘ఎడ్యుకేషన్ అండ్ రెలవెన్స్ ఆఫ్ గాంధీ వ్యూస్’అనే ఆంగ్ల పుస్తకాన్ని బుధవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి వ్యక్తి మంచి ఆలోచనలతో, సమానత్వం, సౌభ్రాతృత్వంతో ముందుకెళ్ళేందుకు గాంధీ బోధనలు అవసరమన్నారు.
గాంధేయవాదమే మార్గం : దిలీప్ రెడ్డి
విలువలతో కూడిన విద్యా వ్యవస్థకు గాంధీ ఆశయాలే శరణ్యమని సమాచార హక్కు మాజీ కమిషనర్, సీనియర్ పాత్రికేయుడు దిలీప్‌రెడ్డి తెలిపారు. ఈ దృక్కోణం లోపించడం వల్లే విద్యావ్యవస్థ అ నేక సవాళ్ళను ఎదుర్కొంటోందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమానికి గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చైర్మన్ డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డి అధ్యక్షత వహించారు.
కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసరావు, విద్యావేత్తలు ఆచార్య ప్రకాశ్, పుల్లయ్య, ఎంవీ గోనారెడ్డి, ట్రస్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎన్ రెడ్డి, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర కార్యదర్శి యానాల ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.