పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్. చిత్రంలో జూలూరు గౌరీశంకర్
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులకు, అధ్యాపకులకు, సాహిత్యలోకానికి ‘తెలంగాణ సమగ్ర సాహిత్య చరిత్ర’ ఓ కరదీపికగా ఉంటుందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఈ గ్రంథం అన్ని రకాల పోటీ పరీక్షలకు, తెలుగు సాహిత్య అధ్యయనానికి దోహదం చేస్తుందన్నారు. తన కార్యాలయంలో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్‌తో కలిసి మంగళవారం ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఇందులో 50 మంది రచయితలు పూర్వయుగం తొలిపాలకులు, వేములవాడ చాళుక్యులు నుంచి మొదలుకుని మలిదశ తెలంగాణ ఉద్యమ సాహిత్యం వరకు నిక్షిప్తం చేశారని పేర్కొన్నారు. గోనబుద్దారెడ్డి, పాల్కురికి సోమనాథుడు, పోతన, భాస్కర రామాయణ కవులు, మారన, గౌరన, గోపరాజు ఇంకా ఆనాటి సంప్రదాయ కవిత్వ పంక్తిలో తెలంగాణది సింహభాగమని వివరించారు.
గౌరీశంకర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దార్శనిక ఆలోచనలతో తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురిస్తున్న ప్రస్తుత బృహత్ గ్రంథం ‘‘తెలంగాణ సమగ్ర సాహిత్య చరిత్ర’’అని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి మామిడి హరికృష్ణ, గ్రూప్–1 అధికారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు మామిళ్ల చంద్రశేఖర్ గౌడ్, కాళోజీ పురస్కార అవార్డు గ్రహీత కోట్ల వెంకటేశ్వరరెడ్డి, ప్రముఖ సాహిత్య విమర్శకులు కేపీ అశోక్ కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment