నటుడు, రచయిత బాసంగి సురేష్ రచించిన ‘కవితా చిత్రమ్’ పుస్తకావిష్కరణ, బాసంగి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన ‘మట్టి మనిషి’ ఫిల్మ్ ప్రివ్యూ రామనాయుడు స్టూడియోస్ లో జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి గా నటుడు, రచయిత, దర్శకుడు హర్షవర్ధన్, గౌరవ అతిథి గా పద్మశ్రీ పురస్కార గ్రహీత చింతల వెంకటరెడ్డి హాజరయ్యారు. ఈ కవితా చిత్రమ్ పుస్తకావిష్కరణ, మట్టి మనిషి ఫిల్మ్ ప్రివ్యూలో నటుడు, రచయిత హర్షవర్ధన్ చేతుల మీదగా జరిగింది. ఈ సందర్భంగా హర్షవర్ధన్ మాట్లాడుతూ.. పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ చింతల వెంకటరెడ్డి ఒక శాస్త్రజ్ఞుడని , నిరుత్సాహపడుతున్న రైతులకు ఆయన స్పూర్తి అని కొనియాడాడు. ‘వెంకటరెడ్డి స్ఫూర్తితో తీసిన ‘మట్టి మనిషి’ డెమో ఫిల్మ్ బాగుంది. ఆయన బయోపిక్ కూడా రావాలని కోరుకుంటున్నాను’ అన్నారు.
పద్మశ్రీ పురస్కార గ్రహీత చింతల వెంకటరెడ్డి మాట్లాడుతూ..సాగుచేస్తున్న నేలలో నిస్సారవంతమైన భూమిని సారవంతం చేయడమే నా ప్రక్రియ . ఇది 2004 లో పేటెంట్ చేయబడింది. ఒక రైతు గా నేను చేసినవే పేటెంట్ కోసం రాశాను. వాటిని వాళ్ళు శాస్త్రీయంగా పరిశీలించి యదాతధంగా ఆమోదించారు. దీని గురించి ప్రధాని మోడీ కూడా మన్ కీ బాత్ లో ప్రస్తావించడం జరిగింది.’ అన్నారు ఈ కార్యక్రమంలో షేడ్స్ స్టూడియో సి.ఇ.ఓ దేవీ ప్రసాద్, బాసంగి సురేష్, చిత్రకారుడు, సినీ గీత రచయిత తుంబలి శివాజీ, సినీ దర్శకులు, ఎస్ ఎస్ పట్నాయక్, కర్రి బాలాజీ, కాళీ చరణ్, మధుసూదన రావు, సంగీత దర్శకుడు సాహిణి శ్రీనివాస్, మట్టి మనిషి దర్శకుడు విరాజ్ వర్మ, నటులు నవీన్, హరినాయక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment