పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న నిఖిలేశ్వర్, కంచ ఐలయ్య, హరగోపాల్, కల్పన కన్నభిరాన్
లక్డీకాపూల్: పౌర హక్కుల కోసం చివరి వరకు పోరాడిన శక్తి కేజీ కన్నభిరాన్ అని కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత నిఖిలేశ్వర్ అన్నారు. ’వీక్షణం’ సంపాదకుడు ఎన్.వేణుగోపాల్ అక్షరీకరించిన కేజీ కన్నభిరాన్ ఆత్మకథాత్మక సామాజిక చిత్రం ’24 గంటలు’ను కల్పనా కన్నభిరాన్ ఆంగ్లంలో అనువదించగా.. ‘ది స్పీకింగ్ కాన్‌స్టిట్యూషన్’ పేరుతో అంతర్జాతీయ ప్రచురణ సంస్థ ‘హార్పర్ కాలిన్స్’ ప్రచురించింది.
శనివారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ పుస్తకాన్ని కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత నిఖిలేశ్వర్ ఆవిష్కరించారు. సభలో ఇంగ్లిష్ పుస్తక అనువాదకర్త, ఎడిటర్ కల్పన, ప్రొఫెసర్ కంచ ఐలయ్య, ప్రొఫెసర్ జి.హరగోపాల్ మాట్లా డారు. కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment