lakdikapool
-
Sakshi Little Stars: ఆశీస్సులే ఆయువు
ఆశ తొణుకుతున్నప్పుడుఆశీస్సు దానిని నిలబెట్టవచ్చు. ఔషధం ఓడుతున్నప్పుడు ప్రార్థన దానిని గెలిపించవచ్చు. అశ్రువు ఉబుకు తున్నప్పుడు ఆర్ద్రత దానిని మందస్మితం చేయవచ్చు. డబ్బు ఖర్చు లేని అనంత దయ, సేవ, ఆర్ద్రత, సాంత్వన మన వద్ద ఉంటాయి. నిజ హృదయంతో వెచ్చిస్తే పని చేస్తాయి. ఈ పిల్లలకు అవన్నీ కావాలి. ఈ పిల్లలు చిరంజీవులై వెలగాలి. ‘సాక్షి’ మీడియా చైల్డ్ సెలబ్రిటీలతో తనదైన ప్రయత్నం చేసింది. హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని ఎం.ఎన్.జె. కేన్సర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాలలు ఒక పూట కువకువలాడారు. పకపక నవ్వారు.నవంబర్ 14 ‘బాలల దినోత్సవం’ నేపథ్యంలో ఎం.ఎన్.జె. కేన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుమారు 150 మంది చిన్నారులను పలకరించే ప్రయత్నం చేసింది సాక్షి మీడియా. ‘పొట్టేల్’. ‘సరిపోదా శనివారం’, ‘మన్మథుడు–2’ వంటి సినిమాల్లో నటించిన బాలతారలు ఖ్యాతి, సాన్విక, స్నితిక్, జాతీయ క్రీడాకారిణి కార్తీకలను తీసుకొచ్చి వారితో ముచ్చటించేలా చేసింది. చైల్డ్ సెలబ్రిటీలు వారి కోసం ఆటలు, పాటలు, డ్యాన్సులతో అలరించారు. అలాగే తమ ఆరోగ్యస్థితిని చైల్డ్ సెలబ్రిటీలతో పంచుకున్నారు.నాకు ప్రస్తుతం బాగానే ఉంది. డాక్టర్లు బాగా చూసుకుంటున్నారు. నాకు అల్లు అర్జున్ సినిమాలంటే ఇష్టం. నన్ను కలవడానికి వచ్చిన సెలబ్రిటీల కోసం పుష్ప సినిమా పాట పాడాను. నా కోసం సాన్విక కూడా పాట పాడింది. వారితో కలిసి మాట్లాడటం హ్యాపీగా ఉంది.– జశ్వంత్మేం సిద్దిపేట నుంచి వచ్చాం. హాస్పిటల్ అంటే నాకు భయం.. కానీ ఇక్కడ బాగానే ఉంది. సినిమాల్లో నటించే వారు మా కోసం రావడం సంతోషంగా ఉంది. నాకు కూడా సినిమాలంటే ఇష్టం. చివరగా శ్యాం సింగరాయ్ సినిమా చూశాను. త్వరగా నయమైతే స్కూల్‌కు వెళ్లాలనుంది. – రిషి ప్రియ, సిద్దిపేటచాలా రోజుల నుంచి ఇక్కడే ఉన్నాను. నాకు చదువంటే చాలా ఇష్టం, ముఖ్యంగా మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం. స్పైడర్‌మ్యాన్ నా ఫేవరెట్. సాన్విక అక్కతో ఆడుకున్నాను, లెక్కలు చెప్పాను. – ఓ చిన్నారి, జహీరాబాద్ బద్దీపూర్నాకు ఫుట్‌బాల్, దాగుడుమూతలు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు అవన్నీ ఆడుకోలేకపోతున్నాను. ఇలా బాధ పడుతున్న సమయంలో వీరంతా వచ్చి నాతో ఆడుకున్నారు. చాలా ముచ్చట్లు చె΄్పారు. నన్ను షూటింగ్‌కు తీసుకెళతానని కూడా చె΄్పారు. – చేతన్విభిన్న పేర్లతో పలు రకాల కేన్సర్లు ఉన్నప్పటికీ అవన్నీ హిమటలాజికల్ మ్యాలిగ్నెన్సెస్, సాలిడ్ ట్యూమర్స్ అనే రెండు విభాగాల కిందకు వస్తాయి. చిన్నారుల్లో దీర్ఘకాలం పాటు హై ఫీవర్, చలి జ్వరం, బ్లీడింగ్, చిగుర్లలో రక్తస్రావం.. శరీరంలో, చాతీలో అసౌకర్యం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, వయసుకు తగ్గట్టు బరువు పెరగక పోవడం లేదా బరువు తగ్గిపోవడం వంటి లక్షణాలు ఉంటే అప్రమత్తం కావాలి. సాలిడ్ ట్యూమర్స్‌లో పిల్లలు అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడం, ఫిట్స్ రావడం జరుగుతుంది. చికిత్స పొందుతున్న చిన్నారులకు క్యాన్సర్‌కు సంబంధించిన అవగాహన అంతగా ఉండకపోవడం వల్ల ఎక్కువగా భయం ఉండదు. కానీ నిత్యం హాస్పిటల్స్ చుట్టూ తిరగడం వల్ల మానసిక ఇబ్బందులకు గురవుతుంటారు. ఈ నేపథ్యంలో వారికోసం ప్రత్యేకంగా ప్లే స్టేషన్ ఏర్పాటు చేశాం. ఇలాంటి వ్యాధితోనే ఇబ్బంది పడుతున్న ఇతర చిన్నారులతో మమేకం చేస్తాం. – అనుదీప్, మెడికల్ ఆంకాలజిస్ట్అవగాహన వచ్చిందికేన్సర్ గురించి కొంచెం అవగాహన ఉంది. అందుకే గతంలోనే ఇలాంటి చిన్నారుల కోసం నేను రెండుసార్లు నా హెయిర్ డొనేషన్ చేశాను. కానీ ఇలాంటి ప్లేస్‌కు రావడం ఇదే మొదటి సారి. వీరి విల్ పవర్ చూశాక సమస్య ల నుంచి ఎలా రాణించాలో ఒక అవగాహన వచ్చింది. మళ్లీ మళ్లీ ఇక్కడికి వచ్చి ఈ చిన్నారులతో ఆడుకోవాలనుంది.– కార్తీక, నేషనల్ ప్లేయర్హెయిర్ డొనేట్ చేస్తానుఈ హాస్పిటల్లో చిన్నారులను చూశాకే కేన్సర్ ఎంత ప్రమాదకరమైనదో తెలిసింది. వారిని చూస్తుంటే ఏడుపొచ్చేసింది. నేను కూడా గతంలో ఇలాంటి వారి కోసం హెయిర్ డొనేట్ చేశాను. మళ్లీ కూడా చేయాలని ఇప్పుడు నిర్ణయించుకున్నాను. –ఖ్యాతి, సరిపోదా శనివారం ఫేమ్వీరిని చూశాక లోపల ఎంతో బాధ కలిగినప్పటికీ దానిని దాచి వీరందరినీ సంతోషపెట్టడానికి ప్రయత్నం చేశాను. పాటలు పాడాను, నాటు నాటు డ్యాన్స్ చేశాను. – సాన్విక, సరిపోదా శనివారంవీరందరినీ ఇలా చూస్తుంటే భయమేసింది. అందరికీ నయం అయి త్వరగా ఇంటికి పోవాలని కోరుకుంటున్నాను. అందరితో ఆడుకున్నాను, డ్యాన్సులు చేశాను. – స్నితిక్, పొట్టేల్ ఫేమ్భయం లేదు చికిత్సలు ఉన్నాయిఅనారోగ్యం అని తెలిశాక పరీక్షల నిర్థారణతో పాటు చికిత్సలో భాగంగా అన్ని సేవలు ఎం.ఎన్.జె. కేన్సర్ హాస్పిటల్లో ఉచితంగానే అందుతాయి. వ్యాధి దశను బట్టి చికిత్స కొనసాగుతుంది. ఈ చిన్నారులకు న్యూట్రిషన్ చాలా అవసరం. దీనికోసం కడల్స్ ఆర్గనైజేషన్ భాగస్వామ్యంతో మంచి న్యూట్రిషన్ అందిస్తున్నారు. చిన్నారుల వయస్సు, బరువును బట్టి ్రపొటీన్ ΄్యాకెట్స్, డ్రై ఫూట్స్ తదితరాలను అందిస్తున్నారు. కీమో, రేడియేషన్ వంటి చికిత్సల కోసం రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడకు వస్తున్న వారికి చుట్టుపక్కల విడిదికి కూడా సహాయం చేస్తున్నారు. కేన్సర్ వ్యాధి జన్యుపరంగా కూడా వస్తున్నప్పటికి అది 15 నుంచి 20 శాతం మాత్రమే. కేన్సర్లకు పలు రకాల కారణాలున్నాయి. కేన్సర్‌కు ఇతర దేశాల్లో అందిస్తున్న అధునాతన చికిత్సకు మనకు వ్యత్యాసం పెద్దగా ఏమీ లేదు. మన దగ్గర కూడా లేటెస్ట్ ట్రయల్స్ మందులు అందుబాటులో ఉన్నాయి. ఈ వారమంతా లిటిల్ స్టార్స్ సందడిని సాక్షి యూట్యూబ్‌లో చూడటానికి QR కోడ్‌ను స్కాన్ చెయ్యండి – డి.జి. భవాని– హనుమాద్రి శ్రీకాంత్ఫొటోలు: అనిల్ కుమార్ మోర్ల -
పౌర హక్కుల కోసం పోరాడిన కన్నభిరాన్
లక్డీకాపూల్: పౌర హక్కుల కోసం చివరి వరకు పోరాడిన శక్తి కేజీ కన్నభిరాన్ అని కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత నిఖిలేశ్వర్ అన్నారు. ’వీక్షణం’ సంపాదకుడు ఎన్.వేణుగోపాల్ అక్షరీకరించిన కేజీ కన్నభిరాన్ ఆత్మకథాత్మక సామాజిక చిత్రం ’24 గంటలు’ను కల్పనా కన్నభిరాన్ ఆంగ్లంలో అనువదించగా.. ‘ది స్పీకింగ్ కాన్స్టిట్యూషన్’ పేరుతో అంతర్జాతీయ ప్రచురణ సంస్థ ‘హార్పర్ కాలిన్స్’ ప్రచురించింది. శనివారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ పుస్తకాన్ని కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత నిఖిలేశ్వర్ ఆవిష్కరించారు. సభలో ఇంగ్లిష్ పుస్తక అనువాదకర్త, ఎడిటర్ కల్పన, ప్రొఫెసర్ కంచ ఐలయ్య, ప్రొఫెసర్ జి.హరగోపాల్ మాట్లా డారు. కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం హాజరయ్యారు. -
Hyderabad Metro: ప్రయాణికుల సంఖ్య పెరిగినా అవే సాంకేతిక ఇబ్బందులు
సాక్షి, హైదరాబాద్: మెట్రో రైళ్లలో ప్రయాణికుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఇటీవల గణేష్ నిమజ్జనం సందర్భంగా రైళ్లలో రద్దీ నాలుగు లక్షల మార్కును దాటి.. ప్రస్తుతం దాదాపు అదే స్థాయిలో కొనసాగుతోంది. కానీ.. మెట్రో రైళ్లు తరచూ మందగిస్తున్నాయి. కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ వ్యవస్థలో సాంకేతిక లోపాలు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. తాజాగా నాంపల్లి– లక్డీకాపూల్ మార్గంలో ట్రాక్‌కు సంబంధించి సాధారణ నిర్వహణ, మరమ్మతులో భాగంగా గ్రౌటింగ్ పనులు జరుగుతుండడంతో రైళ్ల వేగం అకస్మాత్తుగా 15 కేఎంపీహెచ్‌కు పడిపోవడం గమనార్హం. మరో నాలుగు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. సాంకేతిక చిక్కులు.. ► సాధారణంగా మెట్రో రైళ్ల వేగం 50–60 కేఎంపీహెచ్ మధ్యన ఉంటుంది. ఒక్కసారిగా రైళ్ల మందగమనంతో సమయానికి గమ్యస్థానానికి చేరుకుందామన్న ప్రయాణికుల అంచనాలు తప్పుతున్నాయి. రైళ్లు కిక్కిరిసి ఉంటున్న నేపథ్యంలో అకస్మాత్తుగా రైళ్ల వేగం పడిపోయిన ప్రతిసారీ ఏం జరిగిందోనని ప్రయాణికుల్లో ఆందోళన, గందరగోళం నెలకొంటోంది. ► నగర మెట్రో రైళ్లలో డ్రైవర్ అవసరం అంతగా లేని కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ వ్యవస్థను వినియోగిస్తున్నారు. వాతావరణ మార్పులు, ఒక్కసారిగా వాయు కాలుష్యం పెరిగిన సమయంలో ఈ టెక్నాలజీలో తరచూ లోపాలు తలెత్తుతున్నాయి. ఉన్నపళంగా రైళ్లు పట్టాలపై నిలిచిపోవడం, వేగం తగ్గడం తదితర సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సాంకేతికతను మన నగర పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేపట్టాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రద్దీ పెరుగుతోంది.. ప్రస్తుతం నగరంలో అన్నిరకాల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు పుంజుకోవడంతో రైళ్లలో రద్దీ కోవిడ్‌కు ముందున్న స్థాయిలో నాలుగు లక్షలకు చేరువైంది. అత్యధికంగా ఎల్బీనగర్– మియాపూర్ రూట్లో నిత్యం రెండు లక్షల మంది జర్నీ చేస్తున్నారు. ఐటీ కంపెనీల్లో కార్యకలాపాలు ప్రారంభం కావడంతో నాగోల్– రాయదుర్గం రూట్లోనూ రద్దీ 1.75 లక్షల మేర ఉంది. జేబీఎస్– ఎంజీబీఎస్ రూట్లో రద్దీ నిత్యం సరాసరిన 25 వేల మేర ఉంది. పండగలు, సెలవురోజుల్లో మూడు మార్గాల్లో కలిపి ప్రయాణికుల రద్దీ అదనంగా మరో 30 వేల 50 వేల వరకు ఉంటుందని మెట్రో వర్గాలు తెలిపాయి. (క్లిక్ చేయండి: ఫార్ములా– ఈ పనులు రయ్..రయ్) -
ఇవ్వాళ వచ్చి హడావుడి చేస్తున్నారు
లక్డీకాపూల్: ‘రెండు రోజుల అనంతరం విపక్షాల నేతలు ఇవ్వాళ హాస్పిటల్‌కు వచ్చి హడావుడి చేస్తున్నారంటూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి హరీశ్‌రావు మండిపడ్డారు. బుధవారం ఆయన నిమ్స్ ఆస్పత్రిలో వైద్యసేవలు పొందుతున్న ‘ఇబ్రహీంపట్నం కుటుంబ నియంత్రణ ఆపరేషన్’బాధితులను పరామర్శించారు. ఘటన జరిగిన మరుక్షణం నుంచి రాత్రింబవళ్లు వాళ్లను కాపాడుకుంటున్నామని స్పష్టం చేశారు. ఇబ్రహీంపట్నం ఘటనలో ఇన్ఫెక్షన్ సోకి నలుగురు చనిపోవడం దురదృష్టకరమని అన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వైద్యుడి లైసెన్స్ రద్దు చేశామని, సూపరింటెండెంట్ని సస్పెండ్ చేశామని చెప్పారు. భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్త పడతామని, విచారణ కమిటీ నివేదిక రాగానే చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. తాము రాజకీయాలు చేయబోమని, ప్రజల ప్రాణాలు కాపాడతామని మంత్రి స్పష్టం చేశారు. ఇళ్లల్లో ఉన్న మిగిలిన బాధితులను కూడా అంబులెన్స్‌ల్లో తీసుకువచ్చి అపోలో, నిమ్స్ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ఆరోగ్య శాఖ అధికారులు ఆయా ఆస్పత్రుల వద్దే ఉంటూ బాధితుల పరిస్థితిని గంటగంటకూ పర్యవేక్షిస్తున్నారని, నిమ్స్‌లో 17 మంది, అపోలోలో 13 మంది బాధితులు ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నారన్నారు. ఇన్ఫెక్షన్ కూడా తగ్గుముఖం పట్టిందని, రెండు మూడు రోజుల్లో అందరూ డిశ్చార్జి అవుతారని చెప్పారు. ఆరేడేళ్లలో 12 లక్షల కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిగాయని, ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదన్నారు. మరణించిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల నష్టపరిహారాన్ని అందజేశామని, డబుల్ బెడ్ రూం ఇళ్లను కూడా ఇస్తామని మంత్రి హరీశ్ తెలిపారు. -
అన్న వాహిక అమర్చి.. ఆకలి తీర్చి
లక్డీకాపూల్: ఆ ఇద్దరు చిన్నారులు అన్నవాహిక లోపంతో పుట్టారు. తినాలన్నా, తాగాలన్నా అలవికాని పరిస్థితి. తిరగని డాక్టర్ లేడు. చిన్నారులకి ఆకలి బాధ... ఆహారం తీసుకోలేక అలమటిస్తున్న పిల్లలను చూసి తల్లడిల్లిన తల్లిదండ్రులు. పిల్లల, తల్లిదండ్రుల వేదనకు అంతం పలికారు నిమ్స్ వైద్యులు. శస్త్రచికిత్సతో వారిద్దరూ ఆహారం తీసుకునేలా చేశారు. ఏళ్ల తరువాత కడుపునిండా తినగలుగుతున్నారా చిన్నారులు. వివరాల్లోకి వెళ్ళితే.. విశాఖపట్టణానికి చెందిన మేళ్ల కాశీరామ్ కొడుకు కోదండరామ్ (2)అన్న వాహిక లోపంతో పుట్టాడు. ఫుడ్ పైప్ నిర్మాణం సరిగ్గా లేకపోవడంతో పాటు, ఒక కిడ్నీ చిన్నదిగా ఉంది. దీంతో పలు అనారోగ్య సమస్యలకు గురయ్యాడు. అక్కడి వైద్యులు తాత్కాలికంగా కడుపులోకి పైపు వేసి ద్రవ పదార్థం అందించే ఏర్పాటు చేశారు. పెద్ద పేగుకు సంబంధించి మెడ భాగంలో హోల్ వేశారు. దాంతో ఆ బాబు ఏం తాగినా వెంటనే బయటకి వచ్చేసేది. అల్లాడిపోయిన అతని తల్లిదండ్రులు తిరగని ఆస్పత్రి లేదు. చివరికి నిమ్స్ ఆస్పత్రిని ఆశ్రయించారు. అన్నవాహిక అట్రేసియా సమస్యతో బాధపడుతున్న బాబుని గత నెల 29న నిమ్స్‌లో చేర్పించారు. ఏపీ ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.1.50 లక్షలను మంజూరు చేసింది. వ్యాధి నిర్ధారణ అనంతరం సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం వైద్యులు... ఈ నెల 5న శస్త్ర చికిత్స చేసి కృత్రిమ అన్నవాహికను అమర్చారు. పెద్ద పేగును ఒక రక్తనాళం మీదుగా తీసుకుని, అది కూడా పొట్ట కిద నుంచి ఏర్పాటు చేశారు. ఆపరేషన్ విజయవంతం కావడంతో బాలుడు కోదండరావు ఈ నెల 15వ తేదీన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. హైదరాబాద్ ఎల్బీనగర్కు చెందిన మూడున్నరేళ్ల బండి నిష్విత కూడా ఇదే తరహా సమస్యతో సతమతమవుతోంది. ఆమె తండ్రి బి.కృష్ణ రోజువారీ కూలీ. పాపను ఈఎస్ఐ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. వైద్యులు తాత్కాలికంగా పైపు అమర్చి, ద్రవ పదార్థం అందించే ఏర్పాటు చేశారు. అయినా వెక్టరల్ సిండ్రోమ్ సమస్యతో బాధపడుతున్న నిష్వితను మే 5వ తేదీన నిమ్స్‌లో చేర్చారు. మే 10న శస్త్ర చికిత్స ద్వారా ఆమెకు అన్నవాహికను అమర్చారు. ఆ తర్వాత అదే నెల 18న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. అయినా... రెండు నెలలపాటు వైద్యులు అబ్జర్వేషన్లో పెట్టారు. ఇప్పుడు పూర్తి ఆరోగ్యవంతురాలైంది. ఆ చిన్నారుల ఆరోగ్యం మెరుగుపడింది.. నిష్విత, కోదండరామ్‌ల ఆరోగ్యం పూర్తి స్థాయిలో మెరుగుపడింది. వాస్తవానికి అన్నవాహిక సమస్యతో పుట్టిన ఇద్దరు చిన్నారులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గతంలో చేసిన తాత్కాలిక చికిత్సతో ఊపిరితిత్తులు దెబ్బతినకుండా కాపాడగలిగారు. టెక్నికల్లీ డిమాండింగ్ సర్జరీ కావడంతో ఛాలెంజ్‌గా తీసుకున్నాం. వైద్య సిబ్బంది సహకారంతో రెండు ఆపరేషన్లు విజయవంతంగా చేయగలిగాం. ఇరువురికి కృత్రిమ అన్నవాహికను అమర్చి పుట్టుకతో వచ్చిన లోపాన్ని సరిదిద్దాం. ఈ చికిత్సకు అవసరమైన ఆర్థిక స్థోమత రెండు కుటుంబాలకూ లేదు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సీఎంఆర్ఎఫ్ ద్వారా పూర్తిస్థాయిలో సహాయాన్ని అందించాయి. ఇప్పడా చిన్నారులు కావాల్సింది తృప్తిగా తినగలుగుతున్నారు. తాగగలుగుతున్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, నిమ్స్ యాజమాన్యానికి ధన్యవాదాలు. – డాక్టర్‘‘ ఎన్.బీరప్ప, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం అధిపతి, నిమ్స్ -
కేవలం రూ.160 కోసమే గొంతు కోసి చంపి...
నాంపల్లి: లక్డీకాపూల్ టెలిఫోన్ భవన్ సమీపంలోని బస్టాప్ వద్ద ఈ నెల 24న జరిగిన హత్య కేసును సైఫాబాద్ పోలీసులు చేధించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మధ్య మండలం డీసీపీ రాజేష్ చంద్ర, అడిషనల్ డీసీపీ రమణారెడ్డి, సైఫాబాద్ ఏసీపీ వేణుగోపాల్‌రెడ్డితో కలిసి మంగళవారం వివరాలు వెల్లడించారు. జహీరాబాద్, రామ్‌నగర్‌కు చెందిన బోయిన మహేష్ కర్ణాటక రాష్ట్రం, కలబుర్గి జిల్లా, డంజార్గావ్కు చెందిన జె.అనిల్‌కుమార్ బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చారు. అడ్డా కూలీలుగా పని చేస్తూ ఫుట్‌పాత్‌లపై నివాసం ఉండేవారు. ఈ క్రమంలో ఫుట్‌పాత్‌లపై నిద్రిస్తున్న వ్యక్తులను బెదిరించి డబ్బులు లాక్కుని జల్సా చేసేవారు. ఈ నెల 24న లక్డీకాపూల్ బస్టాపు వద్ద నిద్రిస్తున్న ఓ యాచకుడిని టార్గెట్ చేసుకున్న వారు కత్తితో అతడి గొంతు కోసి జేబులో ఉన్న రూ.160 నగదును తీసుకుని పారిపోయారు. రక్తం మడుగులో ఓ వ్యక్తి కొట్టుమిట్టాడుతున్నారంటూ పోలీసులకు సమాచారం అందడంతో సైఫాబాదు పోలీసులు అక్కడికి చేరుకుని బాధితుడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అదే రోజు సాయంత్రం అతను మృతి చెందాడు. కేసును నమోదు చేసుకున్న పోలీసులు ఏసీపీ వేణుగోపాల్‌రెడ్డి నేతృత్వంలో దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించిన పోలీసులు బోయిన మహేష్, జె.అనిల్ కుమార్‌లను నిందితులుగా గుర్తించారు. నాంపల్లి, బజార్‌ఘాట్‌లోని కాలభైరవ దేవాలయం వద్ద వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నిందితులు నేరం అంగీకరించడంతో వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితులను తమ కస్టడీలోకి తీసుకుని మరింత సమాచారాన్ని రాబట్టాల్సి ఉందని డీసీపీ తెలిపారు. కేసును చేధించిన ఇన్స్పెక్టర్ సత్తయ్య, ఎస్సై మాధవి, కానిస్టేబుళ్లు అజీముద్దీన్, అహ్మద్ షా ఖాద్రీలను డీసీపీ అభినందించారు. ఈ సందర్భంగా కానిస్టేబుళ్లకు నగదు రివార్డులను అందజేశారు. (చదవండి: ఫామ్ హౌస్‌లో గుట్టుగా సెక్స్ రాకెట్.. బీజేపీ నేత అరెస్టు) -
భార్య.. భర్త.. ఓ క్రిమినల్
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్ల కారణంగా కాపురాలు కూలిపోయిన ఉదంతాలు తరచూ జరుగుతూనే ఉంటాయి. దీనికి పరస్పర విరుద్ధమైన ఘటన ఇది. అప్పటికే విడిగా ఉంటున్న నగరానికి చెందిన దంపతులను.. పంజాబ్‌కు చెందిన ఓ సైబర్ క్రిమినల్ చర్యలు ఒకటి చేశాయి. బాధితురాలిగా మారిన భార్యకు చేయూతనిచ్చిన భర్త ఆమెతో సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయించాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న అధికారులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఇదీ జరిగింది.. 2003లో వివాహం చేసుకున్న ఓ జంట లక్డీకాపూల్ ప్రాంతంలో నివసించేది. ఈ దంపతులకు తొమ్మిదో తరగతి చదువుతున్న కుమారుడు ఉన్నాడు. వ్యక్తిగత కారణాలతో వీరి మధ్య స్పర్థలు ఏర్పడ్డాయి. దీంతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకుని వేరుగా ఉంటున్నారు. గృహిణి అయిన సదరు మహిళ వద్దే కుమారుడు ఉంటున్నాడు. వీరికి ప్రతి నెలా భర్త అందించే రూ.30 వేల భరణమే జీవనాధారంగా మారింది. ఇటీవల కాలంలో ఆమె ఫేస్బుక్లో యాక్టివ్ అయ్యారు. కొన్ని రోజుల క్రితం ఈమెకు పంజాబ్‌లోని లుథియానాకు చెందిన వ్యక్తితో ఫేస్బుక్ ద్వారా పరిచయమైంది. కొన్నాళ్లు చాటింగ్ చేసుకున్న నేపథ్యంలో తన వివరాలను అతడికి చెప్పింది. తాను లుథియానాలో ప్రభుత్వ ఉద్యోగినని, వ్యాపారం కూడా చేస్తున్నానన్నాడు. తనకు ప్రతి నెలా కనిష్టంగా రూ. 2 లక్షల ఆదాయం ఉంటుందంటూ నమ్మించి పెళ్లి చేసుకుంటానంటూ ప్రతిపాదించాడు. దీనికి ఆమె కూడా అంగీకరించడంతో ఒకటి రెండుసార్లు నగరానికి వచ్చి కలిసి వెళ్లాడు. ఆ సందర్భంలో ఫొటోలు తీసుకున్నాడు. హఠాత్తుగా ఓ రోజు ఫోన్ చేసిన అతగాడు అర్జంట్‌గా కొంత మొత్తం కావాలని తీసుకున్నాడు. ఇలా రెండు సందర్భాల్లో రూ.70 వేలు చెల్లించిన ఆమెకు అనుమానం వచ్చింది. దీన్ని నివృత్తి చేసుకోవడానికి ఆమె స్వయంగా లుథియానా వెళ్లారు. సదరు వ్యక్తి తండ్రిని కలిసి విషయం చెప్పగా.. బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి అయిన తన జీతంతోనే కుటుంబం నడుస్తోందని, తన కుమారుడు ఏ పనీ చేయకుండా ఆవారాగా తిరుగుతుంటాడని జవాబు వచ్చింది. దీంతో మోసపోయానని గుర్తించిన బాధితురాలు తిరిగి వచ్చింది. అప్పటి నుంచి లుథియానా వ్యక్తితో తెగదెంపులు చేసుకుంది. దీంతో కక్షగట్టిన అతగాడు ఫేస్బుక్లో నకిలీ ఐడీలు సృష్టించాడు. వివాహితతో దిగిన ఫొటోలను ఆమెకు, భర్తకు, కుమారుడితో పాటు వారి స్నేహితులకూ పంపి దుష్ఫ్రచారం చేయడం మొదలెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న భర్త ఆమెను కలిసి ఏం జరిగిందో ఆరా తీసి బాధితురాలిగా మారినట్లు గుర్తించాడు. భార్యతో దూరంగా ఉన్న కాలంలో అతడికీ కొన్ని చేదు అనుభవాలు ఎదురు కావడంతో ఇకపై ఆమెతోనే కలిసి ఉండాలని నిర్ణయించుకున్నాడు. లుథియానా వ్యక్తిని బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్న వీళ్లు జంటగా వచ్చి సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. (చదవండి: ఇన్‌స్టాగ్రామ్‌లో మైనర్‌కు ‘ఐ లవ్ యూ’ మెసేజ్) -
లవ్లీ లక్డీకాపూల్
ఖైరతాబాద్: నగరంలో గురువారం ‘లక్డీకాపూల్ వంతెన’ ప్రారంభం కానుంది. లక్డీకాపూల్ చౌరస్తాలో ఎంతో ఆకర్షణీయంగా నిర్మించిన ఈ వంతెనను గురువారం మేయర్ రామ్మోహన్, మంత్రులు, ఎమ్మెల్యేలు తదితర ప్రజాప్రతినిధుల సమక్షంలో ప్రారంభించనున్నారు. ఇంతకీ ఈ లక్డీకాపూల్ చరిత్ర ఏంటంటే...నగరంలో సెంటర్ ఆఫ్‌ద సిటీగా లక్డీకాపూల్‌కు ప్రత్యేకత ఉంది. ఇబ్రహీం కుతుబ్‌షా కాలంలో ఆయన కూతురు ప్రతిరోజు నౌబత్ పహాడ్‌లో ఉన్న గురువు వద్దకు వెళ్లేందుకు ఈ దారిలో ఉన్న కాలువ దాటి వెళ్లాల్సిన పరిస్థితి. దీంతో అప్పట్లో కాలువ దాటేందుకు వీలుగా కర్రలతో వంతెనను ఏర్పాటుచేశారు. హిందీలో అమ్మాయిని లడికీ అంటారు కాబట్టి లడికీ కోసం ఏర్పాటుచేసిన ఈ వంతెనను ‘లడికీకా పూల్’ అని, ఆ తరువాత కాలక్రమేణా ఆ ప్రాంతం లక్డీకాపూల్‌గా ప్రాచుర్యం పొందింది. 1761, మే నెలలో కర్రల వంతెనను ఏర్పాటుచేశారు. 250 సంవత్సరాలకు పైబడిన ఈ కర్రల వంతెన కింద నుంచి నాంపల్లిని కనెక్ట్ చేస్తూ నిజాం హయాంలో రైల్వేలైన్ వేశారు. దశాబ్ధ కాలం వరకు కూడా లక్డీకాపూల్‌లో కర్రల వంతెన ఉండేదని, ఆ వంతెన దాటి వెళ్ళి చుట్టుప్రక్కల ప్రాంతాల్లో రేగుపళ్లు తెచ్చుకునేవారమని ఖైరతాబాద్ ప్రాంత వాసులు చెబుతున్నారు. అలా అమ్మాయి కాలువ దాటేందుకు వేసిన కర్రల వంతెనతోనే ఆ ప్రాంతానికి లక్డీకాపూల్‌గా పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇప్పటికీ చాలా మంది లడికీకాపూల్గా చెప్తుండటమే ఇందుకు ఉదాహరణ. ఇటీవల గ్రేటర్ హైదరాబాద్‌లో జంక్షన్ల సుందరీకరణలో భాగంగా లక్డీకాపూల్‌లో నిర్మించిన లక్డీకాపూల్ పేరుకు చిహ్నంగా అప్పట్లో ఏర్పాటుచేసిన కర్రల వంతెనను గుర్తుచేస్తూ ఏర్పాటుచేసిన నమూనాను గురువారం నగర మేయర్ ప్రారంభించనున్నారు. -
‘గ్లోబల్ ఆస్పత్రి’ ఘటనపై రెండు కేసులు
సాక్షి, సిటీబ్యూరో:లక్డీకాపూల్‌లోని గ్లెనిగల్స్ గ్లోబల్ ఆస్పత్రికి సంబంధించి ఆదివారం రాత్రి చోటు చేసుకున్న ఘటనలపై రెండు కేసులు నమోదు చేసినట్లు మధ్య మండల డీసీపీ విశ్వప్రసాద్ సోమవారం వెల్లడించారు. ఈ కేసులను అన్ని కోణాల్లోనూ సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. సంతోష్‌నగర్‌కు చెందిన షమీనా బేగం ఊపిరి తిత్తులకు సంబంధించిన సమస్యతో ఈ నెల 18న గ్లోబల్ ఆస్పత్రిలో చేరింది. ఈమెకు జరుగుతున్న వైద్యాన్ని కుమారులు మొయినుద్దీన్ అలీ ఖాన్, బర్కత్ అలీ ఖాన్, ముజఫర్ అలీ ఖాన్‌లతో పాటు కుమార్తెలు పర్యవేక్షిస్తున్నారు. స్వైన్‌ఫ్లూ సైతం సోకడంతో షమీనా ఆదివారం రాత్రి మృతి చెందింది. ఎంఐసీయూలో ఆమెకు వైద్యులు సీపీఆర్ ట్రీట్మెంట్ చేస్తుండగా చూసిన కుమారులు వైద్యులపై ఆరోపణలు చేస్తూ విధ్వంసానికి దిగారు. ఘటనాస్థలికి వెళ్లిన పోలీసులను అడ్డుకుని వారిపై దాడి చేశారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తన తల్లి చనిపోయిందంటూ వారు ఇచ్చిన ఫిర్యాదుతో అనుమానాస్పద మృతి కేసు, ఆస్పత్రి భద్రతాధికారి ఇచ్చిన ఫిర్యాదుతో మొయినుద్దీన్ తదితరులపై వివిధ సెక్షన్ల కింద మరో కేసు నమోదు చేసినట్లు డీసీపీ తెలిపారు. ఈ కేసులో వైద్యులు, ఆస్పత్రులపై దాడులు నిరోధించడానికి అమలులోకి వచ్చిన చట్టాన్ని తొలిసారి ప్రయోగించామని, దీని ప్రకారం ఆస్తినష్టాన్ని సైతం నిందితుల నుంచి వసూలు చేసే అవకాశం ఉందన్నారు. -
లక్డీకపూల్లో దారుణం: నాలాలో పసికందు మృతదేహం
-
సింగరేణి భవన్ లో అగ్ని ప్రమాదం
-
సింగరేణి భవన్ లో అగ్ని ప్రమాదం
హైదరాబాద్: హైదరాబాద్ నగరం లక్డీకపూల్ లోని సింగరేణి భవన్లో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భవనంలోని ఒకటో అంతస్తు నుంచి మూడో అంతస్తు వరకు మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ ఇంకా కొంతమంది ఉద్యోగులు మంటల్లోనే చిక్కుకున్నట్టు సమాచారం. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ అగ్ని ప్రమాదం సంభవించిందని అధికారులు అంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
'షీ' టీంకు చిక్కిన ప్రిన్సిపాల్
హైదరాబాద్ క్రైం: రాజధాని నగరంలో బస్‌స్టాప్‌లో మహిళలను వేధిస్తున్న గాయత్రి జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ ద్యాన్‌శెట్టి(37)ని షీ టీం అదుపులోకి తీసుకుంది. బాచ్‌పల్లి, నిజాంపేట గాయత్రి జూనియర్ కాలేజీలో పనిచేసే ఆయన లక్డీకపూల్ బస్‌స్టాప్‌లో మహిళలను వేధిస్తున్నట్లు గురువారం పోలీసులు గమనించారు. దీంతో అతనిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. లక్డికపూల్ బస్‌స్టాప్‌లో నిలబడి ఉన్న మహిళలను బైక్‌పై ఎక్కాలని వేధిస్తుండగా షీ టీం వీడియో సైతం సేకరించింది. -
అడుగుకో అగాధం
మహానగరం విస్తీర్ణం 625 చ.కి.మీ.. గుర్తించిన నీటి నిల్వ ప్రాంతాలు 477..అంటే.. 1.3 చ.కి.మీ.కి ఓ తటాకం.....వెరసి అడుగుకో అగాధం పొంచి ఉందన్నమాట.ఇదీ మహానగర దుస్థితి. ఇంతవరకూ వర్షం వస్తే నీరు నిలిచేప్రాంతాలెన్నో కూడా తెలియని జీహెచ్ఎంసీ సిబ్బంది కాకిలెక్కలతో కాలక్షేపం చేసేది. ఎట్టకేలకు కమిషనర్ సోమేష్‌కుమార్ చొరవతో ఇంజనీరింగ్ సిబ్బంది క్షేత్రస్థాయి పరిశీలనకుదిగింది. వీటి లెక్కలను తేల్చి చెపిది. పకడ్బందీ మరమ్మతులకు సిద్ధమవుతోంది. ఇపి వరకు నగరంలో వర్షం కురిస్తేనీరు నిలిచే ప్రాంతాలెన్ని అంటే.. 108, 118, 121. జీహెచ్ఎంసీ అధికారులు తరచూ చెపేఠ956? పొంతన లేని సంఖ్యలివి.ట్రాఫిక్ పోలీసుల సర్వేతో ఇచ్చిన కొన్ని ప్రాంతాలకు.. మరికొన్ని ప్రాంతాలను చేర్చి చూపుతూ కాలం గడిపే పరిస్థితి. వాటికి మరమ్మతులు చేశామని చెబుతూనే.. మళ్లీ వారే వందకుపైగా నీటినిల్వ ప్రాంతాలున్నాయని సమాధానాలిచ్చేవారు. అదేమిటని ప్రశ్నిస్తే.. ఆయా ప్రాంతాల్లో రహదారులు దెబ్బతినడం.. తదిత ర కారణాలతో పాటు కొత్తవి కూడా వస్తుంటాయనేవారు. మరమ్మతులు చేసినప్పటికీ మళ్లీ దెబ్బతింటాయనేవారు. అంతే తప్ప.. ఒకసారి మరమ్మతు చేసిన వాటికి తిరిగి మరమ్మతులు అవసరం లేదని చెప్పే పరిస్థితి లేదు. నగరంలో నీటినిల్వ ప్రాంతాలెన్నో సరైన లేక్కా ఉండేది కాదు. ప్రస్తుతం ఆ పరిస్థితి మారింది. కమిషనర్ చొరవతో క్షేత్రస్థాయి పర్యటనలకు దిగిన ఇంజనీరింగ్ విభాగం నగరంలో ఏకంగా 477 నీటి నిల్వ ప్రాంతాలున్నట్లు గుర్తించింది. అక్కడిదో ఆగిపోలేదు. ఏయే ప్రాంతాల్లో తరచూ నీరు నిలుస్తోంది? గట్టిగా నాలుగు చినుకులు కురిస్తే చెరువులుగా మారుతున్న ప్రాంతాలేవి? అక్కడున్న రహదారి బీటీయా..సీసీయా ? ఎంత విస్తీర్ణంలో నీరు నిల్వ ఉంటోంది? అందుకు కారణమేమిటి? (రోడ్డు ప్రొఫైల్ సరిగ్గా లేకపోవడమా.. లేక వాలుగా ఉండటమా..) దాని పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఏ రకమైన మరమ్మతులు చేయాలి? రద్దీ దృష్ట్యా, నీటి నిల్వ పరిమాణం దృష్ట్యా దాని ప్రాధాన్యం ఏమిటి? గుర్తించిన వాటిలో అత్యంత సమస్యలు సృష్టిస్తున్నవి ఎక్కడెక్కడున్నాయి? ప్రాధాన్యతా క్రమంలో తొలుత వేటికి మరమ్మతులు చేయాలి? ఇతరత్రా వివరాలతో నివేదికను సిద్ధం చేసింది. కమిషనర్ సోమేశ్‌కుమార్ సూచన మేరకు.. తొలిసారిగా క్షేత్రస్థాయి సర్వే చేసి ఈ నివేదిక రూపొందించినట్లు చీఫ్ ఇంజనీర్ ఆంజనేయులు తెలిపారు. ఓవైపు ట్రాఫిక్ పోలీసుల సర్వేలు.. మరోవైపు తమ సర్వేలే కాక రెండో దఫా కూడా సర్వే చేస్తున్నామని చెప్పారు. సర్వే ఆధారంగా ఇప్పటి వరకు 477 నీటి నిల్వ ప్రాంతాలు, 41 అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామన్నారు. వీటికి వేసవిలో శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేస్తామన్నారు. వర్షాకాలం రావడానికి ముందే ప్రాధాన్యతా క్రమంలో ఈ పనులు చేయనున్నారు. ఒకసారి మరమ్మతు పనులు చేశాక సమస్య తిరిగి పునరావృతమైతే అందుకు ఇంజనీర్లే బాధ్యత వహించాలని కమిషనర్ హెచ్చరించడంతో పకడ్బందీ చర్యలకు సిద్ధమవుతున్నారు. తాజాగా 57 ప్రాంతాల్లో నిలిచిన నీరు వరుసగా కురుస్తున్న వర్షాలతో నగరంలో మొత్తం 57 ప్రాంతాల్లో నీరు నిలిచింది. అందులో సెంట్రల్ జోన్ పరిధిలో 48 ప్రాంతాల్లో, సౌత్‌జోన్ పరిధిలో 9 ప్రాంతాల్లో నీరు నిలిచినట్లు జీహెచ్ఎంసీ విపత్తు నిర్వహణ విభాగం పేర్కొంది. వాటిలో లక్డీకాపూల్, ఎన్ఎండీసీ, మాసాబ్‌ట్యాంక్, అజీజ్‌నగర్, మెహదీపట్నం, టోలిచౌకి, ఎంజేమార్కెట్, బస్‌భవన్, సుల్తాన్‌బజార్ తదితర ప్రాంతాలున్నాయి. అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో కొన్ని.. హిమాయత్‌నగర్ వై జంక్షన్ నారాయణగూడ చౌరస్తా నింబోలి అడ్డ (రైల్వేబ్రిడ్జి కింద) ఫీవర్ ఆస్పత్రి, సుబ్రహ్మణ్యంహోటల్ దగ్గర, తిలక్‌నగర్, రైల్వే బ్రిడ్జి. మోడల్‌హౌస్ లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్ ఇమేజ్ హాస్పిటల్ (అమీర్‌పేట) ద్వారకా మలుపు (లక్డీకాపూల్) హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఎదుట (లక్డీకాపూల్) లక్కీ హోటల్ వద్ద (లక్డీకాపూల్) భారతీయవిద్యాభవన్ కేబీఆర్‌పార్కు వద్ద సీబీఆర్ ఎస్టేట్ హబ్సిగూడ చౌరస్తా-ఎన్ఎఫ్సీ బ్రిడ్జి నాగోల్ బ్రిడ్జి - హబ్సిగూడ సిగ్నల్, సారథి స్కూల్ గోల్కొండ హోటల్, మాసాబ్‌ట్యాంక్ గుడిమల్కాపూర్ మార్కెట్ ఎంజే మార్కెట్ జంక్షన్ గృహకల్ప బస్టాప్ సికింద్రాబాద్ మల్లన్న గుడి - గురుద్వారా రోడ్డు యాక్సిల్ బ్యాంక్, కర్బలా మైదాన్ -
సైఫాబాద్‌లో దొంగ అరెస్ట్: ల్యాప్ టాప్‌లు స్వాధీనం
నగరంలోని లక్డీకాపూల్‌లో ప్రయాణికుల నుంచి వస్తువుల్ని దొంగిలిస్తున్న రవితేజ అనే వ్యక్తిని సైఫాబాద్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 5 ల్యాప్ టాప్లతోపాటు 50 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని సైఫాబాద్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అతనిపై కేసు నమోదు చేశారు. లక్డీకపూల్‌లోని ట్రావెల్స్ వద్ద ప్రయాణికుల నుంచి వస్తువులు దొంగిలించే క్రమంలో రవితేజను ప్రయాణికులు పట్టుకున్నారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు. -
‘సిగ్నల్ ఫ్రీ’.. రాకపోకలు సాఫీ
ఖైరతాబాద్, న్యూస్‌లైన్: లక్డీకాపూల్‌లో గురువారం నుంచి అమల్లోకి వచ్చిన సిగ్నల్ ఫ్రీ విధానం ఫలితాలనిచ్చింది. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వైపు నుంచి వచ్చే వాహనాలు మెహిదీపట్నం వైపు, డీజీపీ కార్యాలయం వైపు నుంచి వచ్చే వాహనాలు నిరంకారి భవన్ వైపు వెళ్లాలంటే లక్డీకాపూల్ జంక్షన్లో ఉన్న సిగ్నల్ వద్ద ఆగాల్సి వచ్చేది. దీనివల్ల ఇటు బస్టాప్‌తో పాటు అటు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వైపు సైతం ట్రాఫిక్ జామ్ అయ్యేది. తాజాగా ‘సిగ్నల్ ఫ్రీ’ విధానం అమలుతో రాకపోకలు కొంతమేర సాఫీగా సాగాయి. వాహనచోదకులు తడబడకుండా నగర ట్రాఫిక్ పోలీసులు లక్డీకాపూల్ జంక్షన్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఉంచి అవగాహన కలిగించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వైపు నుంచి వచ్చే వాహనాలు కొత్త వంతెన వైపు వెళ్లే సమయంలో ఇబ్బంది ఏర్పడకుండా జంక్షన్ వద్ద బారికేడ్లు ఉంచారు. అయితే, వీటి కారణంగా డీజీపీ కార్యాలయం నుంచి వచ్చి నిరంకారి వైపు వెళ్లే వాహనాలు ఆగిపోయాయి. మరోపక్క రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వైపు నుంచి వచ్చిన వారు సైతం కొత్త వంతెన పైకి వెళ్లే యత్నంలో జంక్షన్ వద్ద ఆగిపోతున్నారు. వీరికి ట్రాఫిక్ పోలీసులు మైకు ద్వారా సూచనలిస్తూ మార్గనిర్ధేశం చేశారు. అయోధ్య చౌరస్తా వద్ద సిమెంట్ దిమ్మెలు తొలగించి ఏర్పాటు చేసిన మార్గం వద్ద కూడా ట్రాఫిక్ పోలీసులు.. మెహిదీపట్నం వైపు వెళ్లాల్సిన వారు నేరుగా వెళ్లొచ్చని సూచనలు చేశారు. కొత్త విధానం అమలుతో రెండు వంతెనలపై రద్దీ దాదాపు సమానమైంది. మరో మూడ్రోజుల్లో ఇది అందరికీ అర్థమయ్యేలా చేస్తామని సైఫాబాద్ ట్రాఫిక్ ఠాణా ఇన్స్పెక్టర్ మదన్మోహన్ తెలిపారు. ఇదొక్కటే ప్రస్తుత ఇబ్బంది.. లక్డీకాపూల్ పాత వంతెన నుంచి వచ్చిన వాహనాలు అయోధ్య వద్ద ఏర్పాటు చేసిన కొత్త దారి నుంచి వెళ్తూ ఎడమ వైపునకు తిరిగి బజార్‌ఘాట్‌కు వెళ్లాలని ప్రయత్నించడం ఇబ్బందులు సృష్టిస్తోంది. వీరి వల్ల కొత్త వంతెన మీదుగా వచ్చే వాహనాలన్నీ ఆగిపోయే పరిస్థితి తలెత్తింది. దీనికి పరిష్కారంగా కొత్తగా ఇచ్చిన దారికి ఎడమ వైపు ఉన్న కొలాప్సబుల్ డివైడర్లను మరింత ముందుకు విస్తరించాలని యోచిస్తున్నారు. ఇక, బజార్‌ఘాట్, ఫ్యాప్సీల వైపు వెళ్లే వారు కచ్చితంగా కొత్త వంతెన మీదుగానే వెళ్లాలని సూచిస్తున్నారు. ఇవే మార్గాల నుంచి వచ్చి నిరంకారి భవన్ వైపు వెళ్లే ద్విచక్ర, త్రిచక్ర, తేలికపాటి వాహనాలు అయోధ్య జంక్షన్ నుంచి మాసబ్‌ట్యాంక్ మార్గంలో ప్రయాణించి పీటీఐ బిల్డింగ్ వద్ద ‘యూ’ టర్న్ తీసుకుని గమ్యాలకు వెళ్లాలని సూచిస్తున్నారు.