హైదరాబాద్ క్రైం: రాజధాని నగరంలో బస్‌స్టాప్‌లో మహిళలను వేధిస్తున్న గాయత్రి జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ ద్యాన్‌శెట్టి(37)ని షీ టీం అదుపులోకి తీసుకుంది. బాచ్‌పల్లి, నిజాంపేట గాయత్రి జూనియర్ కాలేజీలో పనిచేసే ఆయన లక్డీకపూల్ బస్‌స్టాప్‌లో మహిళలను వేధిస్తున్నట్లు గురువారం పోలీసులు గమనించారు. దీంతో అతనిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. లక్డికపూల్ బస్‌స్టాప్‌లో నిలబడి ఉన్న మహిళలను బైక్‌పై ఎక్కాలని వేధిస్తుండగా షీ టీం వీడియో సైతం సేకరించింది.