సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్ రచించిన మూడు దారులు పుస్తకాన్ని లండన్‌లో ఆవిష్కరించుకున్నారు ప్రవాసాంధ్రులు. లండన్‌లో డాక్టర్ ప్రదీప్ చింతా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభాకర్ అవుతాల, షాన్ పద్మనాభన్, శ్రీనివాసన్ జనార్థన్, విజయ్ పెండేకంటి తదితరులు పాల్గొన్నారు.
నేటి తరానికి, ముఖ్యంగా తెలుగు ప్రజలకు తెలియాల్సిన ఎన్నో అంశాలను, రాజకీయ ప్రాముఖ్యత ఉన్న ఘటనలను దేవులపల్లి అమర్ పుస్తకం ద్వారా లైవ్‌లో ఉంచారని డాక్టర్ ప్రదీప్ చింతా అన్నారు.
ఎన్టీఆర్‌కు వెన్నుపోటు ఎపిసోడ్, వైస్రాయ్ వేదికగా చంద్రబాబు చేసిన పనులను రచయిత కళ్లకు కట్టినట్లు వివరించారనీ, ఎన్నో ఆధారాలతో పాఠకుల ముందు ఉంచారని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల ఆవిర్భావం మొదలు, విలీనం, విభజన వంటి పరిణామాలు, వాటి వెనుక ఉద్యమాలు, రాజకీయాలను రచయిత సాధికారికంగా ఆవిష్కరించారన్నారు.
ముగ్గురు ముఖ్యమంత్రుల పరిపాలన స్వయంగా చూసి రూపొందించిన ఈ పుస్తకం.. భావి తరాలకు ఓ గైడ్‌గా ఉంటుందని కార్యక్రమానికి హాజరైన అతిథులు తెలిపారు. ఈ పుస్తకం ద్వారా ఎన్నో వాస్తవాలు.. పూర్తి ఆధారాలతో వెలుగులోకి వచ్చినట్టయిందని తెలిపారు. ఈ ప్రయత్నం చేసిన దేవులపల్లి అమర్‌ను ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment