pravasandhrulu
-
మూడు దారులు.. చరిత్రకు సాక్ష్యాలు
సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్ రచించిన మూడు దారులు పుస్తకాన్ని లండన్‌లో ఆవిష్కరించుకున్నారు ప్రవాసాంధ్రులు. లండన్‌లో డాక్టర్ ప్రదీప్ చింతా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభాకర్ అవుతాల, షాన్ పద్మనాభన్, శ్రీనివాసన్ జనార్థన్, విజయ్ పెండేకంటి తదితరులు పాల్గొన్నారు. నేటి తరానికి, ముఖ్యంగా తెలుగు ప్రజలకు తెలియాల్సిన ఎన్నో అంశాలను, రాజకీయ ప్రాముఖ్యత ఉన్న ఘటనలను దేవులపల్లి అమర్ పుస్తకం ద్వారా లైవ్‌లో ఉంచారని డాక్టర్ ప్రదీప్ చింతా అన్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు ఎపిసోడ్, వైస్రాయ్ వేదికగా చంద్రబాబు చేసిన పనులను రచయిత కళ్లకు కట్టినట్లు వివరించారనీ, ఎన్నో ఆధారాలతో పాఠకుల ముందు ఉంచారని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల ఆవిర్భావం మొదలు, విలీనం, విభజన వంటి పరిణామాలు, వాటి వెనుక ఉద్యమాలు, రాజకీయాలను రచయిత సాధికారికంగా ఆవిష్కరించారన్నారు. ముగ్గురు ముఖ్యమంత్రుల పరిపాలన స్వయంగా చూసి రూపొందించిన ఈ పుస్తకం.. భావి తరాలకు ఓ గైడ్‌గా ఉంటుందని కార్యక్రమానికి హాజరైన అతిథులు తెలిపారు. ఈ పుస్తకం ద్వారా ఎన్నో వాస్తవాలు.. పూర్తి ఆధారాలతో వెలుగులోకి వచ్చినట్టయిందని తెలిపారు. ఈ ప్రయత్నం చేసిన దేవులపల్లి అమర్‌ను ప్రశంసించారు. -
సూడాన్‌లో బతికి ఉండే పరిస్థితుల్లేవ్: చీరాలవాసి
సాక్షి, ఢిల్లీ: ఈశాన్య ఆఫ్రికా దేశం సూడాన్‌లో.. ఆర్మీ-పారామిలిటరీ బలగాల నడుమ జరుగుతున్న ఆధిపత్య పోరులో సాధారణ పౌరులు నలిగిపోతున్నారు. కాల్పుల విరమణతో విరామం ప్రకటించడంతో.. అక్కడి నుంచి విదేశీయుల తరలింపు వేగవంతం అయ్యింది. ఈ క్రమంలో ఆపరేషన్ కావేరి ద్వారా సూడాన్ వయా జెడ్డా(సౌదీ అరేబియా) నుంచి భారతీయుల్ని స్వదేశానికి రప్పిస్తున్నారు. తొలి బ్యాచ్‌గా.. ఢిల్లీకి చేరుకున్నారు 360 మంది భారతీయులు. ఈ బృందంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విష్ణు వర్ధన్ కూడా ఉన్నారు. సూడాన్‌లోని పరిస్థితుల గురించి సాక్షితో ఆయన ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడుతూ.. ‘‘మాది గుంటూరు చీరాల. నేను డిప్లోమా చేశాను. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులతో ఆరేళ్ల కిందట సూడాన్ వెళ్లాను. ఓ సెరామిక్ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాను. ఇంతలో అక్కడ అంతర్యుద్ధం మొదలైంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు నేను తిరిగి రావాల్సి వచ్చింది. సూడాన్‌లో బతికి ఉండే పరిస్థితులు లేవు. అక్కడి నుంచి బయటపడితే చాలని బయలుదేరాం. ఆధిపత్యం కోసం రెండు వర్గాలు భీకరంగా పోరాటం చేస్తున్నాయి. ప్రజల వద్ద ఉన్న వాటన్నింటిని దోచుకుంటున్నారు. సూడాన్‌లో కమ్యూనికేషన్ వ్యవస్థ లేదని తెలిపారాయన. ‘‘ఢిల్లీ విమానాశ్రయంలో ఏపీ భవన్ అధికారులు మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. ఏపీ భవన్లో ఉచితంగా భోజనం, వసతి ఏర్పాటు చేశారు. ఢిల్లీ నుంచి చెన్నైకి ఫ్లైట్ టికెట్ బుక్ చేశారు. ఇంటికి చేరేవరకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. మా కోసం చొరవ చూపుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు’’ అని విష్ణువర్థన్ చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. సూడాన్‌లో చిక్కుకున్న ప్రవాసాంధ్రులను క్షేమంగా స్వగ్రామాలకు తీసుకురావాలని సీఎం జగన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దీంతో.. ఏపీఎన్ఆర్టీఎస్ రంగంలోకి దిగింది. సూడాన్‌లో రాష్ట్రానికి చెందిన 58 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాళ్లలో ఇప్పటికే సగానికి పైగా జెడ్డాకు చేరుకున్నారు. అటు నుంచి ఢిల్లీకిగానీ, ముంబైకిగానీ చేరుకునే వాళ్లను స్వగ్రామాలకు తీసుకొచ్చే బాధ్యతలను, అందుకు అయ్యే ఖర్చులను ఏపీ ప్రభుత్వమే భరించనుంది. హెల్ప్‌లైన్ నెంబర్లు.. 0863 2340678 వాట్సాప్ నెంబర్ 85000 27678 ఇదీ చదవండి: మదగజాలు పోట్లాడుకుంటే, మామూలు గడ్డి నలిగిపోయినట్లు.. -
సీఎం జగన్‌కు ప్రవాసాంధ్ర దళిత క్రిస్టియన్ల కృతజ్ఞతలు
NRI News: యూఏఈలోని ప్రవాసాంధ్ర దళిత క్రిస్టియన్లు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. దళిత క్రైస్తవులను ఎస్సీ హోదా కల్పించే విధంగా ఏపీ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టినందుకుగానూ సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు వాళ్లు. శనివారం సాయంత్రం బుర్ దుబాయ్‌లోని వెస్ట్ జోన్ సూపర్ మార్కెట్ దగ్గర పార్క్‌లో ఈ కృతజ్ఞతా సభ జరిగింది. సీఎం వైఎస్ జగన్ ఫొటోకు పాలాభిషేకం చేసి.. అనంతరం వాళ్లు ప్రసంగించారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించే విధంగా అసెంబ్లీలో తీర్మానం చేయడం హర్షనీయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు వాళ్లు. ఈ కృతజ్ఞత సభకు యూఏఈ వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ ప్రసన్న సోమిరెడ్డి కృతజ్ఞతలు తెలియజేస్తూ.. సీఎం జగన్ నాయకత్వంలోని ప్రభుత్వం, అన్ని వర్గాలకు, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ సమాన అవకాశాలు, సమ న్యాయము చేస్తూ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తుంది అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యుఏఈ ప్రవాసాంధ్ర దళిత సంఘాల నాయకులు తరపట్ల మోహన్, పాలపర్తి నీలిమ, కాగిత కుమార్, గోసంగి లక్ష్మి, కొల్లే రవి కుమార్, నక్క ఎలిజిబెత్, ఓగురి శ్రీనివాస్,ఈద శరత్ బాబు,మారుమూడి సుధ, నాగమణి, సాగర్,అనిల్ మోక, మురళి నల్లి,రామరాజు గొడి,తాడి రమేష్, సునీల్ ఖన్నా,నక్క శ్రీనుకుమార్, పండు, తదితరులు పాల్గొన్నారు. -
రెట్.. రైట్
బెంగళూరు, న్యూస్‌లైన్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులు సమ్మె విరమించడంతో ప్రవాసాంధ్రులు ఊపిరి పీల్చుకున్నారు. దసరా పండుగకు సొంత ఊర్లకు పయనమయ్యారు. నగరం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రోజూ 350కి పైగా బస్సు సర్వీసులు తిరుగుతుంటాయి. ఉద్యోగులు సమ్మె విరమించి విధుల్లో పాల్గొనడంతో బస్సులన్నీ క్రమంగా బెంగళూరు వైపు వస్తున్నాయి. శనివారం ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు 250కి పైగా బస్సు సర్వీసులు పంపించామని స్థానిక అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్వ్రీంద్రనాథ రెడ్డి తెలిపారు. హైదరాబాద్, కడప, అనంతపురం, కర్నూలు, నెల్లూరు, తిరుపతి, మదనపల్లి, కాళహస్తి తదితర ప్రాంతాలకు బస్సు సర్వీసులు నడిపామని చెప్పారు. నెల్లూరు జిల్లాలోని కనిగిరి, ఉదయగిరి, కావలి ప్రాంతాల నుంచి శనివారం రాత్రి బస్సులు ఇక్కడికి చేరుకున్నాయని తెలిపారు. కనుక ఆ మార్గాల్లో కూడా సర్వీసులను పునరుద్ధరిస్తామని ఆయన చెప్పారు. కేఎస్ ఆర్టీసీ కూడా... సమైక్యాంధ్ర ఉద్యమంతో ఇన్నాళ్లూ ఆంధ్రప్రదేశ్‌కు నిలిపి వేసిన బస్సు సర్వీసులను కేఎస్ ఆర్టీసీ కూడా పునరుద్ధరించింది. చిత్తూరు, తిరుపతి మార్గంలో 450కి పైగా సర్వీసుల సంచారం ప్రారంభమైంది. -
గుండె కోత
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆమోదిస్తూ కేంద్ర మంత్రి వర్గం గురువారం రాత్రి తీసుకున్న నిర్ణయం ఇక్కడి ప్రవాసాంధ్రులను బాధాతప్త హృదయులను చేసింది. ఏదో ఒక విధంగా రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని ఆశించిన వారికి నిరాశే ఎదురైంది. ఆఖరి నిమిషంలో అద్భుతం జరుగుతుందని ఆశించిన వారికి కేంద్ర మంత్రి వర్గ నిర్ణయం శరాఘాతంలా పరిణమించింది. మెజారిటీ ప్రజల అభిప్రాయానికి భిన్నంగా విభజన జరిగిపోయిందంటూ ప్రవాసాంధ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఓట్లు, సీట్ల కోసం కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై రాష్ట్రాన్ని విభజించాయి. విదేశీ మహిళ అయిన సోనియా గాంధీకి భారతీయ సంస్కృతి, సంప్రదాయాలంటే కనీస గౌరవం కూడా లేదు. ఇందుకు పరాకాష్టే తెలుగుజాతిని రెండు ముక్కలు చేయడం. రాష్ట్ర చరిత్రలో చీకటి రోజు ఇది. 65 రోజులుగా సీమాంధ్ర ప్రజలు చేస్తోన్న ఉద్యమాన్ని కేంద్రం, కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకోలేదు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను కాంగ్రెస్ అధిష్టానం దెబ్బతీసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతుగా టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ ఇచ్చి తెలుగుజాతిని వెన్నుపోటు పొడిచారు. సమైక్యాంధ్రకు మద్దతుగా అన్ని రాజకీయ పార్టీలు కేంద్రానికి లేఖ రాయాలన్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపాదనను ప్రధాన రాజకీయ పార్టీలు గౌరవించి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు’ అంటూ మండిపడ్డారు. అన్నదమ్ముల్లా ఉన్న సీమాంధ్ర, తెలంగాణాలను ముక్కలుగా విభజిస్తుండటంతో రాయలసీమకు తీవ్ర అన్యాయం చేసినట్లు అవుతుందని పలువురు ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం వారు తెలంగాణా నోట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర తెలపడంపై సాక్షితో స్పందించారు. వారి అభిప్రాయాలు ... ఇక కలహాల కాపురమే కేంద్రం నిర్ణయం దిగ్భ్రాంతికరం. అభివృద్ధి నిరోధకం. ఆంధ్రులకు ఊపిరాడకుండా చేసిన నిర్ణయం. ఇన్నాళ్లూ హైదరాబాద్ మనదే అని గర్వంగా చెప్పుకునే వాళ్లం. ఇక కలహాల కాపురమే. - డాక్టర్ ఏ. రాధాకృష్ణ రాజు, అధ్యక్షుడు, కర్ణాటక తెలుగు అకాడమీ, బెంగళూరు చివరి ఆశ కూడా నెరవేరలేదు ఏదో విధంగా ఒకటిగా ఉంటామనే చివరి ఆశా నెరవేరలేదు. హైదరాబాద్ విషయంలో సడలింపో, మినహాయింపో ఉంటుంది అనుకున్నాం. అదీ జరగలేదు. కాంగ్రెస్ ఎందుకిలా ఆంధ్రులపై కక్ష కట్టింది? రెండుసార్లు కేంద్రంలో అధికారం కట్టబెట్టినందుకు ఇది బహుమతా? - వెంకట కృష్ణారెడ్డి, అధ్యక్షుడు, వైఎస్ఆర్ స్మారక ఫౌండేషన్, బెంగళూరు ఇదో పెద్ద అక్రమం ఆంధ్రప్రదేశ్ విభజన పెద్ద అక్రమం. జనం నెత్తిన పిడుగుపాటు. కేంద్రం నిర్ణయం మింగుడు పడడం లేదు. చివరి క్షణం వరకు ఆశాభావంతోనే ఉన్నాం. ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదు. కేంద్ర మంత్రులందరూ ఇప్పటికైనా రాజీనామా చేయాలి - కే. గంగరాజు, పూర్వ ప్రధాన కార్యదర్శి, తెలుగు విజ్ఞాన సమితి, బెంగళూరు పుట్టెడు దు:ఖం మిగిల్చారు నమ్మినందుకు కాంగ్రెస్ నట్టేట ముంచింది. పుట్టెడు దుఃఖం మిగిల్చింది. సోనియా నాయకత్వంలో కేంద్రంలో కాంగ్రెస్ ఏనాటికీ అధికారంలోకి రాదని ఎందరో చెప్పారు. ఆ జోస్యాన్ని ఆంధ్రులు తలకిందులు చేశారు. ఆమె మనకు విభజన బహుమతినిచ్చి ‘రుణం’ తీర్చుకున్నారు.. - బత్తుల అరుణాదాస్,ప్రవాసాంధ్రులు రాజకీయ లబ్ధి కోసమే అన్యోన్యంగా అన్నదమ్ముల్లా ఉండే వారిని రాజకీయ లబ్ధి కోసం తెలంగాణా పేరుతో విభజన చేశారు. రాయలసీమలో ఎలాంటి నీటి పారుదల ప్రాజెక్టులు, పరిశ్రమలు లేవు. ఈ నేపథ్యంలో ప్రత్యేక తెలంగాణా ఇవ్వడంతో సీమ ప్రజలు బజారున పడాల్సిన దుస్థితి నెలకొంది. వెంటనే కేంద్రం విభజన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి. - ఎంపీ జే.శాంత, బళ్లారి ఇది సరైన చర్య కాదు ఆంధ్రప్రదేశ్‌ను ముక్కలు చేయడం సరైన చర్యకాదు. వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమ ప్రాంత ప్రజలను మరింత వెనక్కి నెట్టినట్లయింది. కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే కోట్లాది మంది జనం ఇబ్బందులకు గురవుతారు. నేతలు ఢిల్లీలో కూర్చొని తెలంగాణా ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం అన్యాయం. - శశికళ, మాజీ డిప్యూటీ మేయర్,బళ్లారి ఆవేదనను పాలకులు గుర్తించాలి తెలంగాణా ప్రక్రియను ఆపాలని రెండు నెలలుగా సీమాంధ్రలో జనం ఘోషిస్తుంటే, ఆ ప్రక్రియను ఆపాల్సింది పోయి కేంద్రం ఆఘమేఘాల మీద ఆమోదం తెలపడం ఎంత వరకు సమంజసం. - రాంప్రకాష్రెడ్డి, బస్సు ఓనర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, బళ్లారి -
జై సమైక్యాంధ్ర
బెంగళూరు, న్యూస్‌లైన్ : నగరంలో సమైక్యాంధ్ర ఉద్యమాలు చిన్నగా ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే చర్చా వేదికలు, కవితా గోష్టులు తదితర కార్యక్రమాల ద్వారా సమైక్యాంధ్ర ఆకాంక్షను గట్టిగా వినిపిస్తున్న ప్రవాసాంధ్రులు బుధవారం రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శన ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగానే ఉంచాలని నినదించారు. కర్ణాటక తెలుగు ప్రజా సమితి ఆధ్వర్యంలో టౌన్‌హాల్ ముందు చేపట్టిన ఈ ప్రదర్శనలో భారీ సంఖ్యలో ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమితి అధ్యక్షుడు బొందు రామస్వామి మాట్లాడుతూ సీమాంధ్ర నాయకులు సమైక్యాంధ్ర కోసం పాటు పడాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే ఆ నాయకులందరూ తల దించుకునే విధంగా కర్ణాటకలో రోడ్లను శుభ్రం చేసి, నిరసన కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు. త్వరలో నగరంలోని ఫ్రీడం పార్కులో లక్ష గళ గర్జనను చేపడతామని వెల్లడించారు. కోరమంగలలో వంటా వార్పు చేపడతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక తెలుగు అకాడమీ అధ్యక్షుడు సీవీ. శ్రీనివాసయ్య, అఖిల కర్ణాటక అన్నయ్య చిరంజీవి అభిమానుల సంఘం రాష్ర్ట అధ్యక్షుడు కోటె వెంకటేష్, అఖిల కర్ణాటక రామ్‌చరణ్ యువ సేన రాష్ర్ట ప్రధాన కార్యదర్శి మురళి కళ్యాణ్, అఖిల కర్ణాటక సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు బాబు రాజేంద్రకుమార్, శివకుమార్, సీహెచ్. గురువయ్య, ప్రతాప్, అంబరీశ్, కే. సునీత, ఎస్. వరలక్ష్మి, విజయకుమారి, రాజేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణరాజపురం, కోరమంగల, తావరకెరె, అత్తిబెలె, హలసూరు, యలహంక, హోడి, పద్మనాభ నగర తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు ఈ కార్యక్రమానికి తరలి వచ్చారు.