
సాక్షి, హైదరాబాద్ : విశ్వర్షి వాసిలి యౌగికకావ్యం “నేను”ను తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు డా. నందిని సిధారెడ్డి శుక్రవారం ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ లోని “యోగాలయ”లో యూట్యూబ్, ఫేస్‌బుక్ -యోగాలయ చానల్ ద్వారా ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి తెలుగు విశ్వవిద్యాలయ విశ్రాంత రిజిస్ట్రార్ డా. టి. గౌరీశంకర్ అధ్యక్షత వహిస్తారు. తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయ సాహిత్యశాఖాధ్యక్షులు డా. రాణి సదాశివమూర్తి, డా. దర్భా లక్ష్మీసుహాసిని కావ్య సమీక్షలు చేయనున్నారు.
27 మంది పుస్తకంపై లఘు సమీక్షలు చేయనున్నారు. మైసూరు విశ్వవిద్యాలయ విశ్రాంత ఆచార్యులు ఆర్వీఎస్ సుందరం, మద్రాసు విశ్వవిద్యాలయ విశ్రాంత ఆచార్యులు మాడభూషి సంపత్కుమార్, ఉస్మానియా విశ్వవిద్యాలయ విశ్రాంత ఆచార్యులు డా. మసన చెన్నప్ప, బెంగళూరు విశ్వవిద్యాలయ విశ్రాంత ఆచార్యులు దివాకర్ల రాజేశ్వరి హైదరాబాద్ విశ్వవిద్యాలయ ఆచార్యులు డా. ఎండ్లూరి సుధాకర్ ప్రభృతులు కావ్య సమీక్షలు చేస్తారు. కావ్యకర్త విశ్వర్షి వాసిలి వసంతకుమార్ కావ్యరచనానుభవాలను తెలియజేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment