
సాక్షి, నెల్లూరు : రాష్ట్రంలో అధికారం కోల్పోతున్న చంద్రబాబు.. ఢిల్లీలో చక్రం తిప్పుతాననడం హాస్యాస్పాదంగా ఉందంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ఎద్దేవా చేశారు. శుక్రవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటమి తప్పదని స్పష్టం చేశారు. ఈ ఐదేళ్లలో బాబు భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. చంద్రబాబును ఓడించేందుకు ప్రజలు సిద్ధమయ్యారని తెలిపారు. దేశంలో మరోసారి నరేంద్ర మోదీనే భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment