
మాట్లాడుతున్న రామ్ మాధవ్
సాక్షి, కృష్ణా : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాలక్షేపం కోసం పనిచేసే కమెడియన్లు చాలా మంది ఉన్నారని బీజేపీ జాతీయ కార్యదర్శి రామ్ మాధవ్ ఎద్దేవా చేశారు. ఆదివారం గుంటూరులో జరుగనున్న మహిళా మోర్చా సభలో ఆయన పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేయడానికే ఢిల్లీకి వెళ్లారని, ఏపీ ప్రజల ప్రయోజనాల కోసం కాదని అన్నారు.
ఏపీ, తెలంగాణలలో కాంగ్రెస్‌కు ఊడిగం చేస్తున్నాము.. కేజ్రీవాల్, మాయావతిలను కూడా చేయమని చెప్పడం కోసమే వెళ్ళాడు అంటూ దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వమే మొత్తం నిధులిస్తోందని పేర్కొన్నారు. ఏపీలో గరుడ పురాణం నడుస్తూందని అన్నారు. రానున్న రోజుల్లో ఏపీలో బీజేపీ బలమైన పార్టీగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment