ఆగర్తల: వామపక్షాలకు, బీజేపీకి సిద్ధాంతపరమైన వైరుధ్యం తప్ప ఎలాంటి విబేధాలు లేవని, అభివృద్ధి కోసం మాణిక్ సర్కార్ లాంటి సీనియర్ నాయకులతో కలిసి పనిచేస్తామని బీజేపీ సీనియర్ నేత రాంమాధవ్ అన్నారు. ఇరవైయేళ్ల పాటు రాష్ట్రాన్ని అప్రతిహాతంగా ఏలిన మాణిక్ ప్రభుత్వంపై బీజేపీ సంచలనం విజయం సాధించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని 60 స్థానాల్లో 43 కైవసం చేసుకుని వామపక్ష కంచుకోటపై కాషాయ జెండా ఎగరవేసింది.
నూతన ముఖ్యంమంత్రి విప్లవ్‌దేవ్ ప్రమాణ స్వీకారానికి మాజీ సీఎం మాణిక్‌సర్కార్ ను స్వయంగా రాం మాధవ్ వెళ్లి ఆహ్వానించారు. రాష్ట అభివృద్ధికి ముఖ్యమంత్రిగా 20 ఏళ్ల అనుభవం కలిగిన మాణిక్ లాంటి నిరాడంబరమైన వ్యక్తితో కలిసి పనిచేస్తామని మాధవ్ తెలిపారు. ఈ ఏడాది దేశంలో జరుగనున్న ఎన్నికలకు త్రిపుర విజయం ఎంతో స్పూర్తిని కలిగించిందన్నారు.
త్రిపుర విజయంతో ఈశాన్యంలోని 6 రాష్ట్రాల్లో కాషాయ దళం ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. మరో ఏడాదిలో మిజోరంలో జరిగే ఎన్నికల్లో కూడా తమ పార్టీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండో రోజునే బీజేపీ మద్దతుదారులు కమ్యూనిస్టు నేత లెనిన్ విగ్రహాన్ని కూల్చివేయండంతో పాటు సీపిఎం పార్టీ కార్యాలయాలపై దాడి చేయటంతో దేశవ్యాప్తంగా విమర్శలు వెలువెత్తిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment