
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తనను కలవలేదని బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ‘సాక్షి టీవీ’ ఢిల్లీ ప్రతినిధికి తెలిపారు. గురువారం టీడీపీకి చెందిన ఇద్దరు ముఖ్య నేతలు రాంమాధవ్‌ను కలిసిన అంశాన్ని ఆయన వద్ద ప్రస్తావించగా ‘ఇద్దరు టీడీపీ ముఖ్య నేతలు నన్ను కలిసిన మాట నిజమే. అయితే వారు మా మాతృమూర్తి నెల మాసికం కార్యక్రమానికి వచ్చారు. నన్ను పరామర్శించారు..’ అని వెల్లడించారు. ఎమ్మెల్యే బుగ్గన కలిసినట్టు వచ్చిన వార్తలను ప్రస్తావించగా ‘అందులో నిజం లేదు..’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment