నాడు కీర్తించిన పత్రికలే నేడు విషం చిమ్మాయి | Ram Madhav Comments on Few Print Media | Sakshi
Sakshi News home page

నాడు కీర్తించిన పత్రికలే నేడు విషం చిమ్మాయి

Published Sun, Jul 22 2018 4:09 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

Ram Madhav Comments on Few Print Media - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినప్పుడు థ్యాంక్యూ మోదీజీ అంటూ శీర్షికలు పెట్టి కీర్తించిన కొన్ని తెలుగు పత్రికలే, అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడంపై విషం కక్కాయంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ దుయ్యబట్టారు.

ఈ మేరకు ఆయన ట్విట్టర్‌ ద్వారా స్పందిస్తూ.. 20 16 సెప్టెంబర్‌లో కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన సమయంలో అప్పటి ఆంధ్రజ్యోతి దినప్రతికలో వచ్చిన కథనాలను తన పోస్టుకు జతపరిచారు. చంద్రబాబు తీరుకు ఇదే నిదర్శనమని పేర్కొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement