
సాక్షి, హైదరాబాద్ : రానున్ను లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా నిజామాబాద్‌లో పర్యటన చేయనున్నారు. ఫిబ్రవరి 13న నిజామాబాద్‌లో అమిత్ షా పర్యటిస్తారని ప్రకటించిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ మీడియాతో మాట్లాడుతూ.. పార్టీని బలోపేతం చేయడం కోసం నాయకులు పర్యటిస్తారని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ విజయ పతాకం ఎగురవేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలందరూ మోదీని మళ్లీ ప్రధానిగా చూడాలనుకుంటున్నారని అన్నారు. కేంద్ర బడ్జెట్ ప్రజలందరికీ ఆమోదయోగ్యమైందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి డబుల్ ధమాకా బడ్జెట్ వస్తుందని, మోదీకి ధీటైన నాయకుడు ఏ పార్టీలోనూ లేడని, మహాకూటమిలు మోదీని ఏంచేయలేవంటూ ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment