అమిత్ షాకు గజమాలతో సత్కారం
కమల దళపతి అమిత్ షా బుధవారం నిజామాబాద్‌కు వచ్చారు. ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. తన ప్రసంగంతో శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపారు. తెలంగాణ అభివృద్ధికి మోదీ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారన్నారు. మరోసారి బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు బూత్ స్థాయినుంచి మోదీ స్థాయి వరకు అందరూ కృషి చేయాలన్నారు.
‘‘ఈ ఎన్నికలు సీఎంను ఎన్నుకునేందుకు కాదు.. ప్రధానిని ఎన్నుకునేందుకు జరుగుతున్నాయి. తెలంగాణ ప్రజలు గమనించి ఓటెయ్యాలి. ప్రధాని మోదీ నేతృత్వం లోనే దేశం సురక్షితంగా ఉంటుంది.’’
‘‘పాకిస్తాన్ ఉగ్రవాదుల విషయంలో నరేంద్ర మోదీ సర్కారు.. తూటాకు తూటాతోనే సమాధానం చెప్పింది. అమెరికా, ఇజ్రాయిల్ వంటి దేశాలు మాత్రమే కాదు, భారత్ కూడా సర్జికల్ స్ట్రైక్‌లు చేయగలదని నిరూపించింది.’’ ----- అమిత్‌షా
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో నిస్తేజంలో ఉన్న కమల దళంలో ఆ పార్టీ అగ్రనేత అమిత్‌షా పర్యటన కాస్త ఉత్సాహాన్ని నిం పింది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌లో ఎంతో కీలకమైన బూత్‌కమిటీలు, శక్తి కేంద్రాల ఇన్‌చార్జులకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్‌షా దిశానిర్దేశం చేశారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల గెలు పుకోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. బుధవారం నగరశివారులోని భూమారెడ్డి కన్వెన్షన్ సెంటర్‌లో ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల క్లస్టర్ స్థాయి సమావేశం జరిగింది. సుమారు 40 నిమిషాల పాటు ప్రసంగించిన అమిత్‌షా ఆ పార్టీ శ్రేణులను ఎన్నికలకు సం సిద్ధం చేసేందుకు ప్రయత్నించారు.
కాంగ్రెస్ మిత్ర పక్షాలను లక్ష్యంగా చేసుకుని పదునైన విమర్శలు గుప్పించారు. రాహుల్‌గాంధీ, చం ద్రబాబుతో పాటు, ఇతర ఫ్రంట్ నేతలను లక్ష్యంగా చేసుకుని నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్‌పైనా విమర్శలు చేశా రు. మరో వైపు ఐదేళ్ల బీజేపీ పాలనలో దేశ అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం అమలు చేసిన పథకాలను వివరించా రు. తెలం గాణ అభివృద్ధికి నిధులివ్వడం లేదనే విమర్శలను తిప్పికొట్టిన అమిత్‌షా ఐదేళ్లలో తెలంగాణ అభివృద్ధికి రూ.2.5 లక్షల కోట్ల నిధులిచ్చిన అంశాన్ని ప్రస్తావించారు. మోదీ పాలనలోనే దేశం సురక్షితంగా ఉంటుందని అన్నారు.
అగ్రనేతకు ఘన స్వాగతం..
షెడ్యుల్ ప్రకారమే నిజామాబాద్ నగరానికి చేరుకున్న అమిత్‌షా కు గిరిరాజ్ కళాశాల మైదానంలో పలువురు ముఖ్యనేతలు ఘన స్వాగతం పలికారు. మధ్యాహ్నం 2.05 నిమిషాలకు సభా వేదికపైకి వచ్చారు. ఆయన వెంట పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్, కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయలు ఉన్నారు.
అర్వింద్ సన్మానం.. కార్యకర్తల కేరింతలు
అగ్రనేత అమిత్‌షాను పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అర్వింద్ ధర్మపురి సన్మానించాలని ప్రకటించడంతో సమావేశంలో నాయకులు, కార్యకర్తల ఈలలు, కేరింతలతో మారుమోగింది. పార్టీ జిల్లా అధ్యక్షులు పల్లెగంగారెడ్డి అమిత్‌షాకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అంతకుముందు బీజేపీ రాష్ట్ర సంఘటన మం త్రి శ్రీనివాస్ పార్టీ సంస్థాగత అంశాలను శక్తికేంద్రాల ఇన్‌చార్జులు, బూత్ అధ్యక్షులకు వివరించారు.
పల్లె గంగారెడ్డి అధ్యక్షతన జరిగిన నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, జహీరాబాద్, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాల క్లస్టర్ సభకు ఐదు పార్లమెంట్‌స్థానాల ఎన్నికల ఇన్‌చార్జి ప్రేమేందర్‌రెడ్డి, వెంకటరమ ణి, కృష్ణ సాగర్, పేరాల చంద్రశేఖర్, బాబూమోహన్, యెండల లక్ష్మీనారాయణ, బండి సం జ య్, ధర్మపురి అర్వింద్, ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్త, బస్వా లక్ష్మీనర్సయ్య, అరుణ తార, బొడిగె శోభ, రమాదేవి, రఘునందన్‌రావు, బాణాల లక్ష్మారెడ్డి, వెంకట్‌రమణారెడ్డి, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జులు, ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల శక్తి కేంద్రాల ఇన్‌చార్జులు, బూత్ అధ్యక్షులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment