ఏపీలో బీజేపీని విస్తరిస్తాం : రాంమాధవ్
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో ప్రజల మన్ననలు పొంది పార్టీని విస్తరిస్తామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ అన్నారు. ఢిల్లీలో శనివారం ఆయన మాట్లాడుతూ...ఏపీ అభివృద్ధికి బీజేపీ అన్ని విధాలా సహకరింస్తుందన్నారు. ప్రత్యేక హోదా ఆకాంక్ష ప్రజల్లో బలంగా ఉందన్నారు.
తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదుగుతామని రాంమాధవ్ చెప్పారు. మోదీ పరిపాలనకు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. బీజేపీపై విశ్వాసంతోనే అసోంలో ప్రజలు పట్టం కట్టారన్నారు. అసోంలో 44 శాతం ఓట్లు సాధించగలిగమని...వారి ఆత్మగౌరవం, అభివృద్ధే తమ ఏజెండా అని ఆయన చెప్పారు. బీజేపీ అధికారం చేపట్టి రెండేళ్లు అయినా సందర్భంగా 200 నగరాల్లో పాలనపై రిపోర్టు ప్రకటిస్తామన్నారు. మోదీని రాజకీయంగా ఎదుర్కోలేకే కాంగ్రెస్ పార్టీ అసత్యప్రచారాలు చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ అహంకారాన్ని, వారసత్వాన్ని ప్రజలు తిరస్కరించారని రాంమాధవ్ చెప్పారు.