సాక్షి, విజయవాడ : అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ బీజేపీ శాఖ రిలే నిరహార దీక్షలు ప్రారంభించింది. నేటి నుంచి ఐదు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా రిలే దీక్షలు చేయనున్నారు. ఈ మేరకు బీజేపీ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ విజయవాడలోని ధర్నా చౌక్‌లో సోమవారం దీక్షలను ప్రారంభించారు. ఆయనతో పాటు బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకులు దీక్షలు పాల్గోన్నారు. ప్రభుత్వ అవినీతితోనే అగ్రిగోల్డ్ బాధితులకు అన్యాయం జరిగిందని బీజేపీ విమర్శించింది.
చంద్రబాబు అత్యాశ కారణంగా ఆ సంస్థలో పెట్టుబడులు పెట్టిన 32 లక్షల కుంటుబాలు రోడ్డున పడ్డాయని. అగ్రిగోల్డ్ కుంభకోణంపై తక్షణమే సీబీఐతో విచారణ చేయించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తగిన న్యాయం చేయకపోవడంతో బాధితులు అత్మహత్యలకు పాల్పడే పరిస్థితి వచ్చిందని నేతలు మండిపడ్డారు.
రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం..
అగ్రిగోల్డ్ ఆస్తులపై సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ కన్నేశారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. అగ్రిగోల్డ్ ఆస్తులు రోజురోజుకు ఎందుకు కరిగిపోతున్నాయని ఆయన ప్రశ్నించారు. అమరావతి నిర్మాణం పేరుతో పేదల భుములు కబ్జా చేసినట్లు, పేదల డబ్బులు కూడా తినేయాలని వారు చూస్తున్నారని విమర్శించారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘టీడీపీ నేతలకు పాలన కంటే కాంట్రాక్టులపైనే మక్కువ ఎక్కువ. ఏపీలో లాలూచీ పాలన నడుస్తోంది. లాలూ ప్రసాద్ యాదవ్‌కు పట్టిన గతే చంద్రబాబుకు పడుతుంది. న్యాయం జరగక 35 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు రోడ్డున పడ్డారు. 2019 ఎన్నికల తరువాత అధికారంలోకి రారని తెలిసి దోచుకుంటున్నారు. రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. రాష్ట్రానికి కేంద్ర ఇచ్చిన నిధులపై లెక్కలు ఎందుకు చెప్పడం లేదు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ నుంచి తుపాను బాధితులకు ఎంత ఖర్చు చేశారు?’’ అని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment