సాక్షి, విజయవాడ: అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేబినెట్ తీసుకున్న నిర్ణయం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నిర్ణయం పట్ల అగ్రిగోల్డ్ బాధితుల సంఘం గౌరవాధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చొరవతో తొమ్మిది లక్షల మంది బాధితులకు ఒకేసారి న్యాయం జరుగనుందన్నారు. అగ్రిగోల్డ్ బాధితుల సంఘం తరుపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. 9 లక్షల మంది 20 వేల లోపు ఉన్న అగ్రిగోల్డ్ బాధితులకు 1150 కోట్లు ఇవ్వాలని కాబినెట్ నిర్ణయం తీసుకోవడంపై బాధితుల తరుఫున ధన్యవాదాలు తెలిపారు.
మంగళవారం విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. నిరంతర పోరాట ఫలితంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని అభిప్రాయపడ్డారు. ‘‘మల్టీ లెవెల్ స్కీంల వల్ల అమాయకులు మోసపోయి, ఆర్ధికంగా నష్టపోతున్నారు. గతంలో 250 కోట్లు ఇస్తున్నామని దీక్ష విరమింపజేశారు, కానీ ఒక్క బాధితుడికి కూడా న్యాయం జరగలేదు. ఈ ప్రభుత్వం 1150 కోట్లు ఇస్తామనడం చిన్న విషయం కాదు. ఇప్పుడున్న మంత్రులు ఎదో ఒక దశలో మా ఉద్యమంలో పాల్గొన్న వారే. బినామీ ఆస్తులను కూడా వెంటనే అటాచ్ చేయాలి. ఈ తరహా మార్కెటింగ్ కంపెనీలను పూర్తిగా రద్దు చేయాలి’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment