బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాజ్యసభ ఎన్నికలకు పోటీ చేస్తుండటమే ఇందుకు బలమైన సంకేతమని అంటున్నారు. ఎమ్మెల్యేగా ఉన్న అమిత్ షాను గుజరాత్ ముఖ్యమంత్రిగా పంపిస్తారని నిన్నమొన్నటి వరకు వినిపించింది. ఇప్పుడు ఆయన రాజ్యసభకు పోటీ చేస్తుండటంతో వ్యూహం మారినట్టు తెలుస్తోంది. కేంద్ర మంత్రిమండలిలో షాకు అత్యంత కీలకమైన పోర్టుఫోలియో లభించనున్నట్టు సమాచారం.