నాటి నిజాం నిరంకుశ ధోరణిలోనే నేడు తెలంగాణలో నియంతృత్వ పోకడలో పరిపాలన కొనసాగుతున్నదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ విమర్శించారు. అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసమే టీఆర్‌ఎస్ ఎన్నికల సమయంలో ఉత్తిమాటలు చెప్పిందనే విషయాన్ని ప్రజలు గుర్తించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.