కేసీఆర్‌పై కేంద్ర సంస్థలు దృష్టి పెడతాయి | Ram Madhav commented over kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌పై కేంద్ర సంస్థలు దృష్టి పెడతాయి

Published Tue, Sep 19 2017 1:55 AM | Last Updated on Wed, Aug 15 2018 9:40 PM

కేసీఆర్‌పై కేంద్ర సంస్థలు దృష్టి పెడతాయి - Sakshi

కేసీఆర్‌పై కేంద్ర సంస్థలు దృష్టి పెడతాయి

అభివృద్ధి, సంక్షేమం అని ప్రచారం చేసుకుంటూ అవినీతికి పాల్పడితే సీఎం కేసీఆర్‌పై కేంద్ర విచారణ సంస్థలు దృష్టి పెడతాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ వ్యాఖ్యానిం చారు.

అవినీతికి పాల్పడితే విచారణ తప్పదు: రాంమాధవ్‌
► చీరల పంపిణీ వెనుక కూడా అవినీతి జరిగి ఉండొచ్చు

సాక్షి, హైదరాబాద్‌: అభివృద్ధి, సంక్షేమం అని ప్రచారం చేసుకుంటూ అవినీతికి పాల్పడితే సీఎం కేసీఆర్‌పై కేంద్ర విచారణ సంస్థలు దృష్టి పెడతాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ వ్యాఖ్యానిం చారు. సోమవారమిక్కడ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ముఖ్య నేతలతో కలసి బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ‘‘మిషన్‌ భగీరథ స్వరూపం గురించి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినప్పుడు మంచి పథకమని కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల మంత్రులు అభిప్రాయపడి ఉండొ చ్చు. కానీ క్షేత్రస్థాయిలో అమలు తీరు, అవినీతి వంటివాటిపై విచారణ చేయాల్సిం దే. రాష్ట్రంలో జరుగుతున్న చీరల పంపిణీ సందర్భంగా చాలా ప్రాంతాల్లో నాణ్యత లేవని మహిళలు బహిరంగంగానే అసం తృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

దీని వెనుక కూడా అవినీతి జరిగినట్టుగా అనుమానం వస్తోంది. రానున్న ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుంది.  రాష్ట్రంలోని 17 లోక్‌సభా స్థానాల్లో మెజారిటీ స్థానాలను గెలుస్తాం. రాష్ట్రానికి చెందిన అన్ని రాజకీయ పార్టీల ప్రముఖులు, పెద్ద నాయ కులు అటు ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్‌షాతో, నాతో మాట్లాడుతున్నారు. సరైన సమయం, సందర్భంలో వారంతా బీజేపీలోకి వస్తారు. నాయకులు అంటే సాధారణ నాయకులు కాదు. అత్యంత ప్రముఖులు..’’ అని రాంమాధవ్‌ చెప్పారు. వారు ఏ పార్టీకి చెందినవారు, ఎవరనేది కొంతకాలం ఆగితే తెలుస్తుందన్నారు. అన్ని పార్టీల్లో సమర్థమైన, మంచి చరిత్ర ఉన్నవారందరికీ బీజేపీ తలుపులు తెరిచే ఉన్నాయని పేర్కొన్నారు.  

ఇది నిజాం పాలన..
నిజాం పాలనకు ఏమాత్రం తీసి పోని విధంగా సీఎం కేసీఆర్‌ పాలన సాగుతోం దని రాంమాధవ్‌ దుయ్యబట్టారు. నియం తృత్వ, నిరంకుశ, రజాకార్లను గుర్తుకు తెస్తున్న టీఆర్‌ఎస్‌ పాలనపై బీజేపీ రాజకీ యంగా పోరాడుతుందన్నారు.‘‘అసెంబ్లీలో మెజారిటీ ఉందనే అహంకారంతో పాలన చేస్తున్నారు. ఎన్నికల సందర్భంగా ప్రజల కు ఇచ్చిన హామీలకు దిక్కు లేదు. సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తా మని చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడెం దుకు నోరుమెదపరు? టీఆర్‌ఎస్‌ నోరు పడిపోయిందా? ప్రజాస్వామ్యాన్ని, ప్రతి పక్షాలను టీఆర్‌ఎస్‌ అణచేస్తోంది.

ఆ పార్టీ దురహంకారాన్ని ఎదిరిస్తాం. అధికారం కోసమే మాయమాటలు, అబద్ధాలు చెప్పారనే విషయాన్ని ప్రజలు గ్రహిస్తు న్నారు’’ అని మండిపడ్డారు. కేంద్ర కేబినెట్‌లో టీఆర్‌ఎస్‌ చేరుతుందా అని విలేకరులు అడగ్గా.. ‘ఎన్డీఏలో ఆ పార్టీ లేదు. అలాంటప్పుడు కేబినెట్‌లో చేరుతుం దని ఎలా అంటారు..’ అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వంలో టీఆర్‌ఎస్‌ చేరుతుం దనే ప్రస్తావనకు కూడా అవకాశం లేదన్నారు. కేబినెట్‌లో ఎవరుండాలనే అంశం పూర్తిగా ప్రధాని విచక్షణాధికార మన్నారు. ఏడాదిన్నర ముందుగానే ఎన్నికల కోసం సమాయత్తమవుతున్నట్లు వివరించారు. 2019లో బీజేపీ గెలుపు కోసం మోదీ, అమిత్‌షాతో పాటు రాహుల్‌గాంధీ కూడా కృషి చేస్తారని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో సొంతం గానే పోటీ చేసి గెలుస్తామని, టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేనని చెప్పారు. కంచ ఐలయ్య వైశ్యులను కించపరుస్తూ సమా జంలోని కులాల మధ్య చిచ్చుపెట్టే కుట్ర చేస్తున్నారని లక్ష్మణ్‌ విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement