‘పాక్ 268 సార్లు కాల్పులు జరిపింది’
న్యూఢిల్లీ: గత ఏప్రిల్ నుంచి మార్చి వరకు పాకిస్థాన్ 268సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని కేంద్రం వెల్లడించింది. రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు రక్షణశాఖ సహాయమంత్రి సుభాష్ బమ్‌రే సమాధానమిచ్చారు. నవంబర్‌లో అత్యధికంగా 88సార్లు, గత నెలలో 22సార్లు ఉల్లంఘించిందని తెలిపారు. ఇరు దేశాల అధికారుల మధ్య జరిగిన వివిధ చర్చలో ఈ విషయాన్ని లేవనెత్తామని ఆయన వెల్లడించారు.
ఆర్మీలో 33,458, నేవీలో 14,041, ఎయిర్‌ఫోర్స్‌లో 13,614 ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. నీతి అయోగ్ సిఫార్సు మేరకు కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలో పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రం అనుమతించిందన్నారు. సు–30 ఎంకేఐ యుద్ధవిమానాల విడిభాగాల తయారీకి రష్యా నుంచి టెక్నాలజీని దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.