సరిహద్దుల్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్‌ను చర్చలకు ఆహ్వానిస్తున్నామంటున్న దాయాది దేశం మరోసారి కపట బుద్ధిని బయట పెట్టుకుంది. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళం జరిపిన మెరుపు దాడులను జీర్ణించుకోలేకపోతున్న పాక్.. చర్చలకు సిద్ధమంటూనే మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది.