
'తగిన గుణపాఠం చెబుతాం'
నాసిక్: సరిహద్దు వద్ద కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లఘించిన పాకిస్థాన్ కు తగిన గుణపాఠం చెబుతామని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. పాక్ దాడులకు దీటుగా సమాధానమిస్తామని తెలిపారు.
వ్యాపం కుంభకోణంతో విమర్శపాలైన మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి ఆయన క్లీన్ చీట్ ఇచ్చారు. శివరాజ్ సింగ్ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తోందని కితాబిచ్చారు. తమపై బురద చల్లేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. నాసిక్ త్రయంబకేశ్వర్లో మంగళవారం కుంభమేళాను ఆయన ప్రారంభించారు.