ఎవరికీ తలవంచేది లేదు: రాజ్‌నాథ్
నియంత్రణ రేఖ వెంబడి పాక్ దళాలు పదే పదే కాల్పుల విరమణకు పాల్పుతున్న సందర్భంలో హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గట్టిగా స్పందించారు. భద్రతాదళాలు పాకిస్థాన్‌కు గట్టి సమాధానం ఇస్తాయని, మన దేశం ఎవరి ముందూ తలవంచేది లేదని స్పష్టం చేశారు. దేశవాసులంతా దీపావళి పండుగ జరుపుకొంటుంటే.. భద్రతాదళాలు మాత్రం కంటికి రెప్పలా దేశాన్ని కాపాడటంలో నిమగ్నమయ్యాయని ఆయన అన్నారు. శత్రువుల కుటిల వ్యూహాలను భగ్నం చేస్తున్న సైనికదళాల పట్ల ప్రజలంతా విశ్వాసం ఉంచాలని కోరారు.
పాక్ సైన్యం కవర్ ఫైరింగ్ చేస్తుండగా ఉగ్రవాదులు జమ్ము కశ్మీర్‌లో నియంత్రణ రేఖను దాటి వచ్చి భారత ఆర్మీలైని ఒక సైనికుడిని చంపి, అతడి దేహాన్ని ముక్కలుముక్కలుగా నరికారు. దాంతో ఈ ఘటనకు తగిన స్థాయిలో సమాధానం ఇచ్చి తీరుతామని భారత సైన్యం కూడా హెచ్చరించింది.