జమ్మూకశ్మీర్ లో అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాకిస్థాన్ శుక్రవారం రాత్రి కవ్వింపు కాల్పులకు దిగిందని కేంద్ర హెంమంత్రిత్వ శాఖ వెల్లడించింది.
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ లో అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాకిస్థాన్ శుక్రవారం రాత్రి కవ్వింపు కాల్పులకు దిగిందని కేంద్ర హెంమంత్రిత్వ శాఖ వెల్లడించింది. పాకిస్థాన్ కాల్పులకు దీటుగా స్పందించాలని బీఎస్ఎఫ్ ను రాజ్నాథ్ సింగ్ ఆదేశాలిచ్చారని తెలిపింది.
జమ్మూకశ్మీర్ లోని సాంబా, హిరానా నగర్ సెక్టార్లలోని బీఎస్ఎఫ్ పోస్టులను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ బలగాలు కాల్పులకు తెగబడ్డాయి. భారత సైన్యం దీటుగా స్పందిచడంతో భారీగా కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది.