
పాక్ కు తగిన గుణపాఠం చెబుతాం: జైట్లీ
జైపూర్: సరిహద్దు వద్ద పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న పాకిస్థాన్ కు గట్టి గుణపాఠం చెబుతామని రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ హెచ్చరించారు. పాకిస్థాన్, ఆ దేశం కవ్వింపు చర్యలను మన సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోందని ఆయన తెలిపారు. గత కొద్ది రోజులుగా పాకిస్థాన్ సరిహద్దు వద్ద కాల్పులకు తెగబడుతోందని ఆయన చెప్పారు.
పాక్ తెంపరితనానికి కళ్లెం వేస్తామని చెప్పారు. సైన్యం, సరిహద్దు బలగాలు సరిహద్దు వద్ద సమర్థవంతంగా వ్యవహరిస్తున్నాయన్నారు. జైపూర్ లో ముర్షిదాబాద్ క్యాంపస్ ఆఫ్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్(ఎమ్డీఐ)ను ఆదివారం జైట్లీ ప్రారంభించారు.