
ఆసియా క్రీడల్లో భారత హాకీ ఆటగాళ్ల సంబరం
ఆసియా క్రీడల్లో భారత్ చేతిలో తమ హాకీ జట్టు ఓటమే నియంత్రణ రేఖ పాకిస్థాన్ కాల్పులకు కారణమని బీఎస్ఎఫ్ అధికారులు అంటున్నారు.
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో భారత్ చేతిలో తమ హాకీ జట్టు ఓటమే నియంత్రణ రేఖ పాకిస్థాన్ కాల్పులకు కారణమని బీఎస్ఎఫ్ అధికారులు అంటున్నారు. ఫైనల్లో భారత జట్టు చేతిలో పాకిస్థాన్ హాకీ టీమ్ ఓడిపోయిన తర్వాతే సరిహద్దు వద్ద పొరుగుదేశం దాడులు పెరిగాయని చెబుతున్నారు. ఈ మ్యాచ్ అయిపోయిన వెంటనే పాకిస్థాన్ వైపు నుంచి కాల్పులు ప్రారంభమైయ్యాయని వెల్లడించారు.
ఇటీవల ముగిసిన 7వ ఆసియా క్రీడల్లో భారత హాకీ జట్టు స్వర్ణం సాధించింది. అక్టోబర్ 2న జరిగిన తుదిపోరులో 'షూటౌట్'లో 4-2తో పాకిస్థాన్‌ను ఓడించింది. ఫలితంగా 16 ఏళ్ల విరామం తర్వాత భారత పురుషుల హాకీ జట్టు ఆసియా క్రీడల్లో మళ్లీ పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది.