లేహ్: భారత్–చైనా సరిహద్దులో అక్రమంగా తరలిస్తున్న 108 కిలోల బంగారాన్ని ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీసు(ఐటీబీపీ) సిబ్బంది స్వా«దీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఒక్కోటి ఒక కిలో బరువు ఉన్న 108 బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. ఐటీబీపీ చరిత్రలో ఈ స్థాయిలో భారీగా అక్రమ బంగారం స్వా«దీనం చేసుకోవడం ఇదే మొదటిసారి అని వెల్లడించారు. తదుపరి విచారణ కోసం బంగారం, ఇతర వస్తువులను కస్టమ్స్ విభాగానికి అప్పగిస్తామని పేర్కొన్నారు.
మంగళవారం మధ్యాహ్నం తూర్పు లద్దాఖ్‌లోని చాంగ్‌థాంగ్ సబ్–సెక్టార్‌లో భారత్–చైనా సరిహద్దు అయిన వాస్తవా«దీన రేఖకు ఒక కిలోమీటర్ దూరంలో ఐటీబీపీ 21వ బెటాలియన్ సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు స్మగ్లర్లు తారసపడ్డారు. ఐటీబీపీ సిబ్బందిని చూసి పారిపోయేందుకు ప్రయతి్నంచారు. సిబ్బంది కొంతదూరం వెంటాడి వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా, బంగారం అక్రమ రవాణా వ్యవహారం బయటపడింది. తనిఖీల్లో 108 కిలోల బంగారం లభించింది. స్మగ్లర్లను లద్దాఖ్ వాసులుగా గుర్తించారు. నిందితులను అధికారులు విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment