
న్యూఢిల్లీ: లద్దాఖ్ సరిహద్దులో చైనా సైనికుడిని భారత భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. చుమర్-డెమ్‌చోక్ ప్రాంతంలో సైనికుడు పట్టుబడ్డాడు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన జవాను అనుకోకుండా భారత భూభాగంలోకి ఎంటర్ అయి ఉంటాడని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. అయితే ప్రోటోకాల్ ప్రకారం సమాచారం సేకరించిన తర్వాత అతన్ని తిరిగి పీఎల్ఏ దళానికి అప్పగించనున్నారు. చైనా సైనికుడి వద్ద సివిల్, మిలిటరీ డాక్యుమెంట్లు ఉన్నట్లు భారత అధికారులు గుర్తించారు. (చదవండి: చైనా కొత్త ఎత్తుగడ; అప్పుడే ఉపసంహరణ!)
ఇటీవల లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వద్ద రెండు దేశాల సైనికుల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. జూన్ 14న జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు మృతిచెందారు. ఆ నాటి నుంచి సరిహద్దు ఉద్రిక్తతలు పెరిగిన సంగతి తెలిసిందే. ప్రతిష్టంభనను పరిష్కరించడానికి ఇరుపక్షాల మధ్య అనేక రౌండ్ల సైనిక, దౌత్య చర్చలు జరిగాయి. కాని యథాతథ స్థితిని పునరుద్ధరించే ఒప్పందాలకు కట్టుబడి ఉండటానికి చైనా నిరాకరిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment