గంపల లలితారాణి
పెదగంట్యాడ(విశాఖపట్నం): మండలానికి చెందిన ఓ యువతి అదృశ్యమైన ఘటనపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. న్యూపోర్టు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జీవీఎంసీ 76వ వార్డు పరిధిలోని నడుపూరులో గంపల దాముదమ్మ కుటుంబంతో నివాసం ఉంటున్నారు.
చదవండి: గగుర్పాటు కలిగించే ‘గ్యాంగ్‌స్టర్’ చీకటి కోణం.. కానీ ఇప్పుడు..
ఈమె కుమార్తె గంపల లలితారాణి (19) ఈ నెల 8న పుట్టినరోజు సందర్భంగా బయటకు వెళ్లి వస్తానని చెప్పి, వెళ్లింది. తర్వాత ఇంటికి రాలేదు. దీంతో యువతి తల్లి, బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెదికినా ఫలితం లేకపోవడంతో న్యూపోర్టు పోలీసులను సంప్రదించారు. న్యూపోర్టు హెచ్‌సీ పీవీ రాజు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment