
హర్షిణి
హిమాయత్‌నగర్(హైదరాబాద్): తండ్రి తిట్టాడనే మనస్తాపంలో కుమార్తె ఇంటి నుంచి వెళ్లిపోయిన సంఘటన నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ రాపోలు శ్రీనివాస్‌రెడ్డి సమాచారం మేరకు... విఠల్‌వాడీలో ఉండే మనీష్‌నాయుడు తన కుమార్తె హర్షిణి(17)ని శనివారం రాత్రి కుటుంబ గొడవల కారణంగా కోప్పాడ్డాడు.
చదవండి: జీన్స్ వేసుకోవద్దన్నాడని... భర్తనే కడతేర్చిన మహిళ
దీంతో ఆదివారం ఉదయం బయటికని చెప్పి వెళ్లిన హర్షిణి తిరిగి ఇంటికి రాలేదు. పరిసర ప్రాంతాలు, బంధువులు, స్నేహితుల వద్ద వాకబు చేసినా హర్షిణి ఆచూకీ తెలియలేదు. దీంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హర్షిణి ఆచూకీ తెలిసిన వారు ఫోన్: 94906 16314లో సంప్రదించాలని ఇన్‌స్పెక్టర్ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment