
కలిదిండి(కైకలూరు)/కృష్ణా జిల్లా: గుర్వాయపాలెం శివారు మద్వానిగూడేనికి చెందిన మేడే ఝాన్సీ(19) గురువారం గ్రామ సమీపంలోని ఉప్పుటేరు వంతెన పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు కలిదిండి పోలీసులు తెలిపారు. మేడే శేఖర్‌బాబు, మేరీల కుమార్తె అయిన ఝాన్సీ కైకలూరు ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఝాన్సీ ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదని తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment