న్యాయం జరగలేదన్న మనస్తాపంతో ఆత్మహత్య
రాజోలు : భార్యపై లైంగిక దాడికి యత్నించిన వ్యక్తిపై పోలీసులకు, కుల సంఘాలకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదన్న మనస్తాపంతో పొన్నమండలోని తుఫాన్‌కాలనీకి చెందిన ముగ్గు రామకృష్ణ(26) సోమవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. రామకృష్ణ కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు. అతడికి భార్య నాంచారమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా ములికిపల్లికి చెందిన ముగ్గు ఏడుకొండలు(
ఆస్పత్రి వద్ద బంధువుల ఆందోళన
రాజోలు : భార్యపై లైంగిక దాడికి యత్నించిన వ్యక్తిపై పోలీసులకు, కుల సంఘాలకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదన్న మనస్తాపంతో పొన్నమండలోని తుఫాన్‌కాలనీకి చెందిన ముగ్గు రామకృష్ణ(26) సోమవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. రామకృష్ణ కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు. అతడికి భార్య నాంచారమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా ములికిపల్లికి చెందిన ముగ్గు ఏడుకొండలు(కొండ) ఈ నెల 16, 17 తేదీల్లో రామకృష్ణ లేని సమయంలో, అతడి ఇంటికి వచ్చి నాంచారమ్మపై లైంగిక దాడికి యత్నించాడు. ఈ విషయాన్ని ఆమె తన భర్తకు, బంధువులకు తెలిపింది. వారు ములికిపల్లికి వచ్చి ఏడుకొండలను నిలదీశారు. ఈ సమస్యను కుల సంఘంలో తేల్చుకోవాలని ఏడుకొండలును పిలిపిస్తే, అతడు తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. ఏడుకొండలును పిలిపించారు. కాగా అతడి పెదనాన్న సత్యనారాయణమూర్తి, చిన్నాన్న పెద్దిరాజు ఈ కేసును తారుమారు చేసేందుకు యత్నించారని బాధితురాలి బంధువులు ఆరోపించారు. సెటిల్మెంట్ పేరుతో పలుమార్లు పోలీస్‌స్టేçÙన్‌కు రప్పించుకోవడం, పెద్దల వద్దకు తిరగడంపై రామకృష్ణ మనస్తాపానికి గురయ్యాడు. దీంతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు చేసుకున్నాడు. ఈ క్రమంలో సంఘటనకు కారణమైన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ బుడగ జంగాల సంఘ నాయకులు రాజోలు ఏరియా ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు. మృతుడి భార్య కూడా నిరసన వ్యక్తం చేశారు. నిందితులను అరెస్ట్ చేస్తామని సీఐ క్రిషో్టఫర్ హామీ ఇవ్వడంతో, ఆందోళన విరమించారు. మృతుడి చిన్నాన్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని రాజోలు ఏరియా ఆస్పత్రికి తరలించారు. సీఐ క్రిషో్టఫర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.