
దుర్గాప్రసాద్(ఫైల్)
కాకినాడ క్రైం: కాకినాడ జగన్నాథపురం వంతెన నుంచి సోమవారం రాత్రి ఉప్పుటేరులోకి దూకిన యువకుడి జాడ మంగళవారం రాత్రి వరకు లభ్యం కాలేదు. ఘటనపై జానపురెడ్డి వెంకటరమణ తన కుమారుడు 22 ఏళ్ల దుర్గాప్రసాద్ ఏటిలోకి దూకాడని కాకినాడ వన్ టౌన్ పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశాడు.
చదవండి: కూరగాయల కోసం వెళ్లి.. ఇంటికి రాకపోవడంతో..
బీటెక్‌లో కొన్ని సబ్జెక్టులు ఫెయిలవ్వడంతో మనోవేదనకు గురయ్యాడని, మానసిక వైద్యుడి వద్దకు తీసుకెళ్లి ఇంటికి తిరిగి వెళుతుండగా ఒక్కసారిగా ద్విచక్రవాహనం దిగి జగన్నాథపురం వంతెన నుంచి ఉప్పుటేరులోకి దూకాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. వెంకటరమణ ఫిర్యాదుతో వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com
Comments
Please login to add a commentAdd a comment