తల్లి శ్రీలక్ష్మితో విష్ణు సాయిరెడ్డి (ఫైల్ )
కడప అర్బన్/చెన్నూరు: కమలాపురం నియోజక వర్గం చెన్నూరు మండలం రామనపల్లెకు చెందిన అటవీశాఖ రాష్ట్ర డైరెక్టర్ రామన శ్రీలక్ష్మి, చంద్రమోహన్‌రెడ్డి ఏకైక కుమారుడు రామన విష్ణు సాయిరెడ్డి (24) రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన కడప– కృష్ణాపురం రైలు మార్గంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. కడప రైల్వే పోలీసులు తెలిపిన కథనం మేరకు ఆదివారం ఉదయం ఓ యువకుడు రైలు కిందపడి చనిపోయాడని సమాచారం అందింది. రైల్వే ఎస్‌ఐ రారాజు తమ సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. అక్కడ వారికి లభించిన ఆధారాల మేరకు మృతదేహం రామన శ్రీలక్ష్మి, చంద్రమోహన్‌రెడ్డి కుమారుడు రామన విష్ణుసాయిరెడ్డిదిగా గుర్తించారు.
చదవండి: బ్యాంకు ఉద్యోగి వక్రబుద్ధి.. జల్సాలు.. అడ్డదారులు.. చివరికి కటకటాలు
తరువాత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలియజేశారు. కాగా రామన విష్ణుసాయిరెడ్డి లండన్‌లో ప్రస్తుతం చదువుకుంటూ ఉండేవాడు. సెలవులు ఇవ్వడంతో ఇంటికి వచ్చాడు. తన స్నేహితులతో కలిసి శనివారం రాత్రి గడిపాడని, అర్ధరాత్రి నుంచి కనిపించకుండా పోయాడు. తెల్లారేసరికి విగతజీవుడై కనిపించడంతో తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు కన్నీటిపర్యంతమయ్యారు. అతని మృతికి కారణం తెలియరాలేదు.
రామన శ్రీలక్ష్మి కుటుంబానికి నేతల పరామర్శ
అటవీశాఖ రాష్ట్ర డైరెక్టర్ రామన శ్రీలక్ష్మి కుటుంబసభ్యులను నేతలు పరామర్శించారు. డిప్యూటీ సీఎం ఎస్‌బి అంజద్‌బాషా, కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి, ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్ అబ్బిరెడ్డిగారి మల్లికార్జునరెడ్డి, రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ అధ్యక్షుడు పులి సునీల్‌కుమార్, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర నాయకులు మసీమబాబు, ఆర్.వి.ఎస్.ఆర్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధికారప్రతినిధి గుమ్మా రాజేంద్రప్రసాద్‌రెడ్డి, కడప మార్కెట్‌యార్డ్ చైర్మన్ జిఎన్ భాస్కర్‌రెడ్డి, జెడ్పీటీసీ ముదిరెడ్డి దిలీప్‌రెడ్డి, ఎంపీపీ చీర్ల సురేష్‌బాబు, ఎంపీటీసీ ముదిరెడ్డి సుబ్బారెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు సొట్టం నారాయణరెడ్డి తమ ప్రగాఢసంతాపాన్ని తెలియజేశారు. అనంతరం శ్రీలక్ష్మి కుమారుడికి అంత్యక్రియలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment