ఎవరెస్ట్‌పై అన్మిష్ వర్మ భూపతిరాజు
దొండపర్తి (విశాఖ దక్షిణ): విశాఖకు చెందిన భూపతిరాజు అన్మిష్ వర్మ (28) ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు. మార్షల్ ఆర్ట్స్‌లో ప్రపంచ చాంపియన్ అయిన అన్మిష్ ఈ నెల 1న ఈ ఘనత సాధించాడు. ఎంబీఏ పూర్తి చేసిన ఆయన ప్రపంచ కిక్ బాక్సింగ్, కరాటే యూనియన్ చాంపియన్ షిప్స్‌లో 2018 గ్రీస్‌లోను, 2019 ఆ్రస్టియాలోను గోల్డ్ మెడల్స్ సొంతం చేసుకున్నారు.
2017లో పర్వతారోహణ చేయాలని నిర్ణయించుకున్న అన్మిష్ ఇందుకోసం ప్రత్యేకంగా శిక్షణ కూడా పొందారు. అనంతరం వింటర్ ట్రైనింగ్ ప్రోగ్రాం కింద –40 డిగ్రీలు ఉన్న సమయంలో లద్దాక్‌లో మంచు పర్వతాన్ని ఎక్కారు. 2020లో లాక్‌డౌన్‌కు ముందు ఆఫ్రికాలోని కిలిమంజారో, దక్షిణ అమెరికాలో అకాన్కాగువా పర్వతాలను అధిరోహించి.. అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ(గండికోట) సహకారంతో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి తన కల నెరవేర్చుకున్నాడు.
చదవండి: వంద శాతం విద్యుదీకరణ భేష్: ఏపీకి నీతి ఆయోగ్ ప్రశంస
YS Jagan: గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో జోష్
Comments
Please login to add a commentAdd a comment